రాశిఫలం -07/20/2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
బహుళ తదియ ఉ.6.09
నక్షత్రం: 
శతభిషం రా.తె.5.16
వర్జ్యం: 
ఉ.10.37 నుండి 12.23 వరకు విశేషాలు: సంకష్టహర చతుర్థి
దుర్ముహూర్తం: 
ఉ.06.00 నుండి 07.36 వరకు
రాహు కాలం: 
ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధన లాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
వృషభం: 
(కృత్తిక 2,3,4పా., రోహిణి, మృగశిర 1,2పా.) కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.
మిథునం: 
(మృగశిర 3,4పా., ఆర్ద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగానుండుట అవసరం.
కర్కాటకం: 
(పునర్వసు 4పా., పుష్యమి, ఆశ్రేష) వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలుచేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగానుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.
కన్య: 
(ఉత్తర 2,3,4పా., హస్త, చిత్త 1,2పా.) ఆకస్మిక ధన లాభముంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగానుంటారు. ప్రతి విషయంలో అభివృద్ధిఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
తుల: 
(చిత్త 3,4పా., స్వాతి, విశాఖ 1,2,3పా.) తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగానుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు
వృశ్చికం: 
(విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగానుండుట మంచిది. అనారోగ్య బాధలధిగమించుటకు ఔషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్తవహించుట మంచిది. మానసికాందోళన అధికమగును. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తివస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతనకార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) విందులు, వినోదాలకు దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశముంది. మానసికాందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్నవిషయంలో ఆటంకాలెదురగును. ఆరోగ్యంగూర్చి ప్రత్యేకశ్రద్ధ అవసరం.
కుంభం: 
(్ధనిష్ఠ 3,4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ మేర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. క్రొత్తకార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొన్ని ముఖ్యమైన పనులు వాయిదావేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బందిపడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్తవహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.
Date: 
Saturday, July 20, 2019
author: 
- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి