రాష్ట్రీయం

నిష్పాక్షికతే ప్రభుత్వ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పోలీసింగ్‌లో పారదర్శకత, నిష్పాక్షికత తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఉండవల్లి ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో మంగళవారం శాంతిభద్రతల అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు సహా ప్రజల్లో పోలీసుల పట్ల విశ్వాసం పెంపొందించేందుకు గ్రామాల్లో ప్రజాదర్బార్లను నిర్వహిస్తామని వెల్లడించారు. కచ్చితమైన పరిశోధన, త్వరితగతిన బాధితులకు న్యాయం వంటివి తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతలని వివరించారు. రౌడీ షీటర్లకు కౌనె్సలింగ్, సమస్యాత్మక ప్రాంతాల్లో సీనియర్ పోలీస్ అధికారుల పర్యటన, రాత్రి సమయాల్లో బస చేయడం వంటి చర్యల ద్వారా చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళలపై, పిల్లలపై రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు, నేరగాళ్లను కట్టడి చేసేందుకు సంచార మహిళా పోలీసు బృందాల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. రహదారుల్లో ప్రయాణికుల భద్రత తమ ప్రభుత్వానికి అంత్యంత ప్రాధాన్యత అంశమన్నారు. రోడ్డు ప్రమాణాలు, ప్రాణనష్టం నివారించేందుకు కళాశాలు, పాఠశాలలు, జనసమూహాలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. రహదారి భద్రతకు సంబంధించి నియమాలను వివరించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సామాజిక సంపదైన యువత గంజాయి, తదితర మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా, వాటి వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు. యువతను అసాంఘిక చర్యలకు ప్రోత్సహించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో మెట్రో నగరాలకే పరిమితమైన ఈ దురలవాట్లు, రాష్ట్రంలోని చిన్నచిన్న గ్రామాలకూ విస్తరిస్తున్నాయన్నారు. దీనిని నిరోధించే అంశంపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ర్యాగింగ్‌ని నిరోధించేందుకు ఆయా కళాశాల యాజమాన్యాలతో కలిసి అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. పోలీస్ శాఖలోని 13,059 ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఈ శాఖను మరింత బలోపేతం చేస్తామన్నారు. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు కూడా ఈ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహిళా, గిరిజన పోలీస్ బెటాలియన్‌లు సహా నాలుగు బెటాలియన్లను ఏర్పాటు ద్వారా నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా, అభ్యంతరకరమైన పోస్టులు, ఫోన్‌లతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
చిత్రం...సదస్సులో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి సుచరిత