కృష్ణ

ముచ్చటగా మూడోసారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, : స్థానికి ద్వారకామాయి నగర్‌లో వేంచేసియ్ను శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో తాళం, భజన పోటీలను 101 టీములతో నిర్వహించి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ముచ్చటగా మూడోసారి చోటు దక్కించుకుంది. గతంలో 501 నిముషాలలో 501 మందితో 501 భక్తి గీతాలు పాడించి తొలి రికార్డ్‌ను నమోదు చేసుకోగా, 101 భగవన్నామ సంకీర్తనలను 1500 మందితో ఏకకాలంలో లలితా సహస్ర నామ పారాయణ చేసి వరుసగా రెండోసారి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును సాయి మందిరం నమోదు చేసుకుంది. తాజాగా సాయి మందిరం 25వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన తాళం, భజన పోటీలతో ముచ్చటగా మూడోసారి తన రికార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును శృంగేరి విరూపాక్షానంద పీఠాధిపతి గంభీరానంద భారతీయ స్వామిజీ చేతుల మీదుగా తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం కో ఆర్డినేటర్ ఎంఎహ్‌కే కుమార్ స్థానిక శ్రీ షిరిడీ సాయి సంస్థాన్‌కు అందించారు.

విజేత తాడేపల్లిగూడెం భక్త బృందం
స్థానిక శ్రీ షిరిడీ సాయి మందిరంలో మందిర 25వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల తాళం, భజన పోటీలలో ప్రధమ స్థానం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భక్త భృందం దక్కించుకుంది. రెండు రాష్ట్రాల నుండి 101 టీములు హాజరవగా గత నాలుగు రోజులుగా ఎంతో ఉత్కంఠభరితంగా పోటీలు జరిగాయి. ఈ పోటీలలో ద్వితీయ స్థానం కృష్ణాజిల్లా చోరగుడి భక్త బృందం, తృతీయ స్థానం గుంటూరు జిల్లా కొల్లిమర్ల భక్త బృందం దక్కించుకున్నట్లు సాయి సేవాదళ్ కో ఆర్డినేటర్ వి బాలాజీప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా కొన్ని బృందాలకు కన్సొలేషన్ బహుమతులు, పోటీలలో పాల్గొన్న అన్ని బృందాలకు సర్ట్ఫికెట్లు స్వామీజీ చేతుల మీదుగా అందించటం జరిగిందన్నారు. కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార మండలి కృష్ణాజిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, సాయి బాబా మందిర కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, కృష్ణారావు, ప్రభాకరరావు, లక్ష్మణరావు, వాణిపతి శాస్ర్తీ, సేవాదళ్ సభ్యులు, భజన సమాజం సభ్యులు పాల్గొన్నారు.