సబ్ ఫీచర్

‘కృష్ణబిలం’.. ఓ సాంకేతిక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కృష్ణబిలం’ అంటే నల్లటి ఊహాతీతమైన అంతులేని చీకటి గుహాంతర్భాగం. విశ్వాంతరాళ అంతరిక్షం లో అంతర్నిహిత అనంత అదృశ్యశక్తి ఆవిర్భావం. విశ్వంలో సూక్ష్మాతిసూక్ష్మంగా అనంతమైన సాంద్రతతో అనిర్వచనీయమైన కాలం- బిగ్‌బాంగ్ సమయంలో ఆవిర్భవించిందని, మానవజాతితో పాటు దానితో ఉన్న సర్వసృష్టి నిరంతరాయంగా అస్తిత్వంలో ఉన్నాయని అరిస్టాటిల్, ఇతర గ్రీక్ తత్త్వవేత్తలు విశ్వసించారు. క్రమేపీ మానవ శాస్ర్తియ తార్కిక మేధావిజ్ఞానం- విశ్వరహస్యాలను ఛేదించి గుట్టువిప్పే సంచలన శాస్ర్తియ అనే్వషణల అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంది. గెలీలియో, ఐజాక్ న్యూటన్, మరెందరో శాస్తజ్ఞ్రులు ఖగోళ భౌతికశాస్త్ర అత్యాధునిక సాంకేతిక పరిశోధనా ప్రజ్వలనంతో రోదసిని అనే్వషించారు. 1905నాటికి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం ప్రస్తావనలో గురుత్వాకర్షక అలలు కనుగొనటంతో విప్లవాత్మక పరిశోధనా అధ్యయనం వెలుగుచూసింది.
విశ్వంలోని అన్ని నక్షత్ర కూటాలకు, తారాపుంజాలకు, గెలక్సీలకు పాలపుంత సంపూర్ణ విశ్వవ్యవస్థకు గురుత్వాకర్షణశక్తి- స్పేస్, టైమ్‌లను విశే్లషించి అద్భుత శాస్ర్తియ విజ్ఞానిగా ఐన్‌స్టీన్ సఫలీకృతులయ్యారు. భూగోళంపై జీవావిర్భావం లేని యుగంలో భూమికి 13.7 బిలియన్ సంవత్సరాల కాలగర్భంలో రెండు బ్లాక్‌హోల్స్ పరిభ్రమించే సమయంలో పుట్టిన గ్రావిటీవేవ్స్ మహావిశ్వంలో ప్రయాణిస్తున్న శాస్ర్తియ స్వప్నం కేవలం ఊహకాదని నేడు వాస్తవమైంది. కోట్లాది సంవత్సరాల తరువాత 21వ శతాబ్దంలో 2015 సెప్టెంబర్ 14న అమెరికాలోని లూసియానాలో లేజర్ ఇంటర్ ఫెరామీటర్ గ్రావిటేషనల్ అబ్జర్వర్’(విగో) గుర్తించి విశ్వదర్శనానికి వినూత్నద్వారం తెరిచింది. 1970 నుంచి ఖగోళ శాస్తవ్రేత్తలు సూర్యుడి కంటే ఒక బిలియన్ రెట్లు భారమైన సూపర్ ద్రవ్యత కలిగిన బ్లాక్‌హోల్స్‌ను, పాలపుంతలో అదృశ్యంగా పసికట్టినా వాటి రూపాన్ని పట్టుకోవటం సాధ్యం కాలేదు! సూపర్‌మాసివ్ బ్లాక్‌హోల్ ఎమ్ 87, పొరుగున గెలాక్సీ సుమారు 55 ట్రిల్లియన్ లైట్ ఇయర్స్ దూరంలో పసికట్టారు. ఒక కాంతి సంవత్సరం 5.9 ట్రిలియన్ మైల్స్ లేదా 9.5 ట్రిలియన్ కిలోమీటర్లు. ఈ కృష్ణబిలం సుమారు 6 బిలియన్ రెట్లు సూర్యునికంటె పెద్దదైన దృశ్యరాశి కలిగివుందని నిర్ధారించారు. రెండు సంవత్సరాలుగా 200మంది శాస్తజ్ఞ్రులు ప్రపంచవ్యాప్తంగా 8 రేడియో టెలిస్కోప్‌లతో నిర్విరామంగా శ్రమించి ఎట్టకేలకు ఈవెంట్ హారిజన్ పేరిట టెలిస్కోప్ ద్వారా 2017 ఏప్రిల్ 6 ‘ఇమేజ్’ తీసుకోగలిగారు. బ్రసెల్స్, సాంటియగో డిచిలీ, తాపై, టోకియో, వాషింగ్టన్‌లలో ఒకేసారి ఈవెంట్ హారిజాన్ టెలిస్కోప్ సమష్టి సాంకేతిక విజయంగా ‘క్లిక్’ మనిపించటం 2019 ఏప్రిల్ 10 ప్రపంచానికి ప్రప్రథమంగా అద్భుత బ్లాక్‌హోల్ చిత్రాన్ని చూపించగలగటం ఖగోళ శాస్త్ర చరిత్రలో అపూర్వ విజయమైంది. సూపర్ కంప్యూటర్‌లతో వందలాది టెరాబైట్స్ డేటాను వినియోగించుకొంటూ రెండు సంవత్సరాలు అవిరళ సమష్టి శోధనల సారాంశం 2017 డిసెంబర్ 23న మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మ్యాక్స్‌ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రేడియో అస్ట్రోనమీ శాస్తవ్రేత్తలు వందలాది హార్డ్‌డిస్క్‌లలో కుదించి సెంట్రల్ ప్రాసెసింగ్ కేంద్రానికి తరలించారు. ఈవెంట్ హారిజాన్ టెలిస్కోప్ డైరెక్టర్ షెపర్డ్ డోల్మాన్, వాషింగ్టన్ ప్రప్రథమ ఫొటోగ్రాఫ్‌ను విడుదలచేసి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు.
పరమాద్భుత అనే్వషణలు...
కృష్ణబిలాలుగా మనం చెప్పుకొంటున్న బ్లాక్‌హోల్స్ విశ్వమంతా విస్తరించి వున్నాయి. 1960లో బ్లాక్‌హోల్‌గా వీటికి అమెరికా భౌతిక శాస్తవ్రేత్త జాన్ ఆర్చిబాల్డ్ వీలర్ పేరుపెట్టారు. ఈ గహ్వర బిలం వెలుపలి అంచును ‘ఈవెంట్ హొరైజన్’ అంటారు. అపరిమిత గురుత్వాకర్షణశక్తి వుండటంతో కాంతిపుంజం కూడా దీన్నించి తప్పించుకోలేదు. అంధకారమయంగా, అంతంలేని అనంతంతో నరకముఖ ద్వారం యిందులో అంతా అదృశ్యం. తిరిగిరాని ఏలోకానికో పయనించే మృత్యుగహ్వరం యిది. ఈ ఖగోళ అద్భుత చిత్రంలో భయంకరమైన చీకటి నోరువిప్పుకొన్న కేంద్ర భాగం, చుట్టూ నారింజ, తెలుపు కాంతి విలయ గ్యాస్ వలయం, మేటర్, స్పేస్, టైమ్ మూడింటి శాశ్విత అంతాన్ని ఆహ్వానించే విలయ బీభత్సం. సృష్టి అంతానికి మృత్యుముఖ సంకేతం.
ప్రపంచం మానవాళి ఎదుట, ఈనెలలో ఛాయాచిత్రంగా ఆవిష్కృతమైన కృష్ణబిలం వెదజల్లుతున్న శే్వత వర్ణపు ఎలక్ట్రోమేగ్నటిక్ రేడియేషన్ ప్రసరించే, ప్లాస్మాతో ఈ కృష్ణబిల ఛాయాచిత్రం యింతవరకు ఊహాజనిత కళారూపంగావున్నా అద్భుతవాస్తవ శాస్ర్తియ సాంకేతిక విజయంగా కళ్ళకుకట్టింది. బ్రసెల్స్, షాంఘై, టోక్యో, వాషింగ్టన్, శాంటియాగో, తైపైలోని ఖగోళ శాస్తవ్రేత్తలు మొట్టమొదటిసారిగా ప్రపంచమానవాళికి విశ్వంలో పొంచివున్న విలయ శాశ్వత అద్భుత వివరాలను విశదీకరించారు. మధురఫలంలా కనుపిస్తున్న రూపం, కృష్ణబిలం అనిర్వచనీయ, ఊహాతీతమైన విశ్వరహస్యాల గుట్టువిప్పే భవిష్య శాస్ర్తియ ధార్మిక మేధస్సుకు మార్గంచూపిస్తోంది. కన్యారాశి, ధనుస్సు రాశి సంబంధిత నక్షత్ర మండలాలకు చెందిన వర్గోలోని మెస్మియర్ 87, సగిట్టారియస్-ఎ నక్షత్రాలు భూమండలానికి 55 మిలియన్ లైట్ ఇయర్స్, 26వేల లైట్ ఇయర్స్ దూరంలో మానవాళి సమీపించలేని సుదూరంలో వున్నాయి.
‘సూపర్ మాసివ్ బ్లాక్‌హోల్స్’, నక్షత్ర మండలాలలోని అసంఖ్యాక మృత నక్షత్ర ప్రభావాల కారణంగా వెల్లివిరుస్తున్నాయి. అదృశ్యంగా ఉండే ఈ కృష్ణబిలాలు 18వ శతాబ్దంనుంచే ఖగోళ శాస్తవ్రేత్తల దృష్టి ఆకట్టుకొంటున్నాయి. యిప్పుడు అవి టెలిస్కోప్ కంటికి చిక్కాయి. తాజాగా బహిష్కృతమైన కృష్ణబిలం వెడల్పు 40 బిలియన్ కిలోమీటర్లు. భూమండలంతో పోలిస్తే 30లక్షల రెట్లు ఎక్కువ. అంతరిక్షంలోని నక్షత్ర మండలాలలో 200-300 బిలియన్ నక్షత్రాలున్నాయి. విశ్వాంతరాళంలో 100 బిలియన్ గెలాక్సీలున్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి అంచనాగ సుమారు 1.6 గ్రహాలున్నాయి. భూమిలాంటి గ్రహాలు విశ్వంలో 40 బిలియన్ వున్నాయి. ధృవీకరించబడిన గ్రహాలు 1789 వున్నాయి. భూగ్రహంలాంటి ధృవీకరించబడిన గ్రహాలు 10 వున్నాయి.
విశ్వవిఖ్యాత భౌతిక శాస్తవ్రేత్త స్టీఫెన్ విలియం హాకింగ్, ఈ బ్లాక్‌హోల్స్, రేడియేషన్ ప్రసరింపచేస్తాయని, కృష్ణబిలాలు పూర్తిగా అంధకారంతో నిండుతున్నవి కావు. వాటినుంచి ఉద్భవించిన ఒక వెలుగు రేఖ.. ‘హాకింగ్ రేడియేషన్’ అని పరిశోధనాదీప్తితో విశ్వపరిణామక్రమాన్ని కనుగొన్న అద్భుత మేధావి.

-జయసూర్య 94406 64610