వారం వారం గోచారం

వారం వారం గోచారం (27-5-2018 నుంచి 2-6-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆది సోమ వారాల్లో భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. పరిచయాలు పెంచుకునే అవకాశం. స్నేహానుబంధాలపై ప్రత్యేక దృష్టి. పెద్దలతో అనుబంధాలు మెరుగుపడతాయి. కొత్త పనుల నిర్వహణ. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని కార్యక్రమాల్లో అనుకూలత. వివేకం పెంచుకునే ప్రయత్నం. మంగళ బుధవారాల్లో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. క్రమరహిత ప్రయోజనాలపై దృష్టి. కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడులుంటాయి. మాట విలువ తగ్గే సూచనలు. అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. కొత్త పనులను వాయిదా వేయాలి. గురు శుక్ర శనివారాల్లో అన్ని కార్యక్రమాల్లో సంతృప్తి. దూర ప్రయాణాలపై దృష్టి.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆది సోమ వారాల్లో వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. శ్రమ అధికవౌతుంది. శత్రువులపై విజయం పోటీ రంగంలో జాగ్రత్తగా అడుగు వేయాలి. తట్టుకునే శక్తి పెంచుకుంటారు. ఖర్చులు పెట్టుబడుల్లో ఇబ్బందులు. వ్యర్థమైన ప్రయాణాలు. విందు వినోదాల్లో ఇబ్బందులుంటాయి. మంగళ బుధవారాల్లో పరిచయాల వల్ల ఇబ్బందులుంటాయి. సామాజిక, వైవాహికానుబంధాల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. నిర్ణయాత్మక భావనలుంటాయి. ఆత్మవిశ్వాసం. వ్యక్తిగత నిర్ణయాదులపై దృష్టి. మొండితనం కూడదు. గురు శుక్ర శనివారాల్లో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. ఒత్తిడులను అధిగమించాలి.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆది సోమ వారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. కొత్త ప్లానింగ్ ఉంటుంది. సంతానంతో సంతోషంగా గడుపుతారు. ఆశించిన ప్రయోజనాలు కొన్ని సమకూరకపోవచ్చు. లాభాలపై దృష్టి తగ్గించాలి. పెద్దలతో కొంత జాగ్రత్తగా మెలగాలి. సృజనాత్మక శక్తి ఉంటుంది. మంగళ బుధవారాల్లో పోటీలు, ఒత్తిడులు, చికాకులుంటాయి. కోపతాపాలు పెరిగే సూచనలు. మొండితనం పెంచుకోవద్దు. శత్రువులపై శ్రమతో విజయం. ఖర్చులు పెట్టుబడులు అధికం. వ్యాపార, అధికార సంబంధ ప్రయాణాలు. గురు శుక్ర శనివారాల్లో పరిచయాలు అనుబంధాలు విస్తరిస్తాయి. వైవాహిక, భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆది సోమవారాల్లో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలపై దృష్టి. గృహ వాహనాది వ్యవహారాల్లో ఒత్తిడులు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలు ఉంటాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. అన్ని పనుల్లో శ్రమ ఉంటుంది. వ్యాపారాదుల్లో కొంత అనుకూలత. మంగళ బుధవారాల్లో ఆలోచనలకు అనుకూలత. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానంతో సంతోషంగా గడుపుతారు. క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్త ప్లానింగ్ ఉంటుంది. లాభాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయోజనాలుంటాయి. గురు శుక్ర శనివారాల్లో వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. కార్యనిర్వహణలో ఒత్తిడులుంటాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆది సోమవారాల్లో సంప్రదింపుల్లో జాగ్రత్త వహించాలి. సహకారం అందించే ప్రయత్నం చేయాలి. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదర వర్గంతో అప్రమత్తంగా మెలగాలి. కమ్యూనికేషన్స్ కొంత ఫలిస్తాయి. దూర ప్రయాణాదులకు అనుకూలత. ఆధ్యాత్మిక వ్యవహారాలపై మనసు కేంద్రీకరించడం మంచిది. మంగళ బుధవారాల్లో సౌకర్యాదులపై దృష్టి. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. విందులకు అవకాశం. విద్యారంగంలో గుర్తింపు. శ్రమతో కార్యక్రమాల్లో అనుకూలత. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. ఘర్షణ తప్పకపోవచ్చు. గురు శుక్ర శనివారాల్లో అభీష్టసిద్ధి. కొత్త ఆలోచనలు. సొంత రూపకల్పనలు. సంతానవర్గంతో అనుకూలత.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆది సోమవారాల్లో కుటుంబంలో అనుకూలత. ఆర్థికానుబంధాలు పెరుగుతాయి. మాటల్లో చమత్కార ధోరణి. నిల్వధనంపై దృష్టి. అనుకోని సమస్యలుంటాయి. వ్యర్థంగా కాలం, ధనం పోయే అవకాశం. అన్ని పనుల్లో కొంత జాగ్రత్త. మంగళ బుధవారాల్లో సంప్రదింపుల్లో సమస్యలుంటాయి. కమ్యూనికేషన్స్, మీడియా రంగం వారు జాగ్రత్త వహించాలి. దగ్గరి ప్రయాణాల్లో అనుకూలత ఉండదు. సోదర వర్గంతో సమస్యలు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. గురు శుక్ర శనివారాల్లో సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాలున్నా శ్రమాధిక్యం.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆది సోమవారాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల నిర్వహణ. అన్ని పనుల్లో సంతోషం, సంతృప్తి. వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. భాగస్వామ్యాల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. మాట విలువ తగ్గే సూచనలు. నిల్వధనం కోల్పోయే అవకాశం. శ్రమరహిత ఆదాయంపై దృష్టి. అనుకోని సమస్యలున్నా శ్రమతో అధిగమిస్తారు. గురు శుక్ర శనివారాల్లో సంప్రదింపుల్లో ఒత్తిడులుంటాయి. ఇతరులకు సహకారం మనం అందించడంవల్ల మేలు కలుగుతుంది. ప్రయాణాదులపై దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆది సోమవారాల్లో ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. విందులు వినోదాలపై దృష్టి. కాలం, ధనం, శ్రమ వ్యర్థం కాకుండా కాపాడుకోవాలి. ప్రయాణాదుల్లో ఒత్తిడులు. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. కార్యనిర్వహణలో అనుకూలత. మంగళ బుధవారాల్లో నిర్ణయాదులకు అనుకూలత. కొత్త పనులకు శ్రీకారం. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను నిర్వహిస్తారు. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త వహించాలి. కొత్త పరిచయాలు, స్నేహానుబంధాల్లో ఒత్తిడులుంటాయి. గురు శుక్ర శనివారాల్లో కుటుంబంలో శుభ పరిణామాలు. అందరి కలయిక. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. మాట విలువ పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆది సోమవారాల్లో ప్రయోజనాలపై దృష్టి. ఆశించిన లాభాలు అందక సమస్యలు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. నిర్ణయాదులు జాగ్రత్తగా తీసుకోవాలి. సంతానవర్గ వ్యవహారాల్లో అనుకూలత. నూతన కార్యక్రమాల రూపకల్పన. సృజనాత్మకత పెరుగుతుంది. మంగళ బుధవారాల్లో ఖర్చులు పెట్టుబడుల్లో సంతృప్తి. విందులు వినోదాల కోసం కాలం ధనం వెచ్చిస్తారు. ప్రయాణావకాశాలు. ఓటీలు, ఒత్తిడులు కూడా ఉంటాయి. వ్యతిరేకతలను అధిగమించాల్సి ఉంటుంది. అన్ని పనుల్లో జాగ్రత్తగా మెలగాలి. గురు శుక్ర శనివారాల్లో నిర్ణయాదుల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆది సోమ వారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారుల ఆదరణ లభిస్తుంది. శ్రమ ఉన్నా గుర్తింపు, సామాజిక గౌరవం పొందుతారు. అన్ని పనులు పూర్తి అవుతాయి. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. సౌఖ్యలోపం. మంగళ బుధవారాల్లో ఆశించిన లాభాలు పొందక ఇబ్బంది పడతారు. అన్ని పనుల్లోనూ ప్రయోజనదృష్టి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. సంతాన వర్గంతో అనుకూలత. నూతన కార్యక్రమాల నిర్వహణ దృష్టి. కొత్త కార్యక్రమాలపై దృష్టి. గురు శుక్ర శనివారాల్లో ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. ఆసుపత్రులు, పరామర్శలకు అవకాశం. జాగ్రత్తగా మెలగాలి. వ్యర్థమైన ప్రయాణాలు.
కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆది సోమవారాల్లో కొత్త పనులు నిర్వహిస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలత. వైజ్ఞానిక భావనలుంటాయి. ఉపాసన బలం పెంచుకుంటారు. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. సహకారం ఇతరులకు అందించాలి. మంగళ బుధవారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. సామాజిక గౌరవం శ్రమతో సాధ్యం. ఆహార విహారాల్లో అనుకూలత. సౌఖ్యం లభిస్తుంది. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. గురు శుక్ర శనివారాల్లో ప్రయోజనాలపై దృష్టి. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నం. లాభాలు కొంత ఒత్తిడికి గురి చేయవచ్చు. మనోభీష్టాలు నెరవేరుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆది సోమవారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలు. గౌరవ లోపాలు. శ్రమరహిత ప్రయోజనాలపై దృష్టి. అన్ని పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో ఒత్తిడి. ఆర్థిక నిల్వలు ప్రభావితం చేస్తాయి. మాట విలువ కొంత పెరిగే అవకాశం. మంగళ బుధవారాల్లో దూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాల రూపకల్పన. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. సహకార లోపాలకు అవకాశం. సోదరవర్గ సంబంధ ఒత్తిడులుంటాయి. గురు శుక్ర శనివారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. గుర్తింపు, గౌరవాదులుంటాయి. పనిచేసే చోటులో అధికారుల అనుకూలత. సహకారం లభిస్తుంది.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ