తెలంగాణ

రేషన్ అక్రమ రవాణా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రభుత్వ రేషన్ సరుకులను కొనుగోలు చేస్తూ అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పేదలకు అందించే ప్రభుత్వ బియ్యాన్ని రేషన్ డీలర్లు, కార్డు హోల్డర్ల వద్ద సేకరించి అధిక ధరలకు విక్రయిస్తున్న అక్రమ వ్యాపారుల గోదాములపై మంగళవారం సివిల్ సప్లయి అధికారులతో కలసి దాడులు నిర్వహించారు. అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి 2200 క్వింటాళ్ల బియ్యం, 1113 క్వింటాళ్ల గోధుమలు, 2750 లీటర్ల కిరోసిన్, 137 క్వింటాళ్ల పంచదార, 42 క్వింటాళ్ల, పప్పు, మిర్చి వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా వీరిపై పలు కేసులు నమోదైనట్టు వెస్ట్‌జోన్ పోలీసులు తెలిపారు. వరంగల్ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బుస్సా శ్రీనివాస్, నల్గొండ జిల్లా తిప్పర్తికి చెందిన పాల్వాయి కరుణాకర్, హైదరాబాద్ మంగళహాట్‌కు చెందిన మహమ్మద్ జమీల్, ఆసిఫ్‌నగర్‌కు చెందిన సయ్యద్ మురాద్, మంగళ్‌హాట్‌కు చెందిన మహమ్మద్ నరుూమ్, గోల్కొండకు చెందిన మహమ్మద్ హబీబ్‌లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. బుస్సా శ్రీనివాస్ బియ్యం వ్యాపారి. కాగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల వద్ద పేదలకు అందించే ఒక రూపాయికి కిలో బియ్యాన్ని రూ. 10ల చొప్పున కొనుగోలు చేస్తాడు. అలాగే రేషన్ డీలర్ల వద్ద రూ. 8.00ల నుంచి రూ. 12.00ల వరకు కొనుగోలు చేసి సేకరించిన 800 క్వింటాళ్ల బియ్యాన్ని నల్గొండ జిల్లా తిప్పర్తికి, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు తరలించాడు. ఇటీవల శ్రీనివాస్‌పై అంబర్‌పేట, ఉప్పల్, చిలకలగూడ పోలీసు స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. రైస్ మిల్లర్ పాల్వాయి కరుణాకర్, బుస్సా శ్రీనివాస్ కొనుగోలు చేసే బియ్యాన్ని తీసుకొని కాకినాడకు తరలిస్తుంటాడు. ఈ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తాడు. ఇతనిపై కీసర, అంబర్‌పేట, చిలకలగూడ పోలీసు స్టేషన్లలో పలు కేసుల్లో నిందితులు. అదేవిధంగా నగరానికి చెందిన జమీల్, నరుూమ్ వీరు బ్రోకర్లుగా పనిచేస్తుంటారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్ని వ్యాపారులు, శ్రీనివాస్, కరుణాకర్‌ల ద్వారా కర్నాటక, గుజరాత్, నిజామాబాద్ జిల్లాలకు తరలిస్తారు. వీరిపై కూడా పలు స్టేషన్ల పరిధిలో కేసులున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లయ్ అధికారులు, టాస్క్ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో భారీగా బియ్యం, గోధుమలు, కిరోసిన్, పంచదార లభించాయి. ఈ మేరకు వారిపై పిడి యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు టాస్క్ఫోర్స్ డిసిపి తెలిపారు.