వీరాజీయం

ముంబాయ్ నిశా(షా)చరులకు శుభవార్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబాయి బార్ డ్యాన్సులు ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్. ఐతే, మహరాష్ట్ర గవర్నమెంట్ మొదట్నుంచీ ఈ గరమ్ మసాలా బార్‌ల మీద కక్షతో, బ్యాన్ చేస్తూనే వుంది. బార్‌ల యజమానుల సంఘాలు, ‘బార్‌బాల’ల ‘‘్భరతీయ బార్ డ్యాన్సుల అసోసియేషన్’’ వగైరాలు కోర్టులో గవర్నమెంట్ ఆర్డర్స్‌ని సవాల్ చేస్తూనే వున్నాయి.
2005నుంచీ రుూ పోరాటం ముదురుపాకాన పడి సాగుతూనే వున్నది. మొదటి హైకోర్టు వీటిని కొనసాగనివ్వమంటూ తీర్పునిచ్చింది గానీ మహరాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లింది. ఏదో సామెత చెబుతారే- ‘మారాజుకి చెబితే మరి రెండు వడ్డించమన్నాడని’- అలాగే సుప్రీంకోర్టు - హైకోర్టుని ‘హైహై’అని అభినందిస్తూ తక్షణం డాన్సింగ్ వ్యాపారాన్ని- స్వర్గతుల్యంగా నిశా(షా)చరులు భావించే బార్ రెస్టారెంటుని కళావేదికగా పునరుద్ధరించమన్నది. కానీ గవర్నమెంటు వినలేదు. మార్చి 15లోగా లైసెన్సులు పిలిచిమరీ యిప్పించమన్నది-
ఈమధ్య చాలా కొత్త మాటలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. తాజా పదం- ‘యాంటీ నేషనలిస్టు’ అన్నది. బాగా పాత మాట ‘మోరల్ పోలీసింగ్’. ఓ పెద్దమనిషి- పత్రికారచయిత ‘నేను యాంటీ నేషనలిస్టునని చెప్పుకోడానికి విర్రవీగుతున్నాను’అంటూ సంబరపడిపోయాడు కూడాను.
మరోమాట వుంది ఫండ‘‘మెంటల్’’రైట్ అని- ఇంచుమించు యివాళ రేపు అన్ని ‘‘మెంటల్ రైట్స్’’ ఫండమెంటలే! డ్యాన్స్ అనేది కూడా తెలుగులో ఏమంటారో- ‘ప్రాథమిక హక్కు’అని కదూ- ఆ కోవలోకే వస్తుంది- అని సుప్రీంకోర్టు తాజాగా నుడివిన తరువాత మనమేంటి చెబుతాం? కాని ఎక్కడా? ఏమి తీరు డ్యాన్సూ? ఎవరిముందు ఎవరు చేయదగ్గ నృత్యం? లాంటి ధర్మసందేహాలు అన్నీ ప్రతీపవాదం క్రిందే లెక్క- ఔరా!
మహరాష్ట్ర గవర్నమెంట్ సుప్రీం వారికి- ‘‘అయ్యా! అశ్లీల, అసభ్య నగ్న, అర్ధనగ్న నృత్యరీతులను కైపెక్కిన రంజైనచోట ప్రదర్శించాలి కదా? దాన్ని మేం సి.సి.కేమెరాలు పెట్టి మానిటర్ చేస్తాం అంగీకరించండి’’- అన్నది.
‘‘ఏమీ అక్కరలేదు. మనం యింకా ఆ ప్రిమిటివ్ స్టేజ్‌లో లేము. అటువంటివి చేస్తే- తలుపుతాళం కన్నంలోంచి ఏకాంత దృశ్యాలు తిలకించినట్లు అయిపోతుంది’’ - అన్నారు ఘనత వహించిన ఉచ్చతమ న్యాయస్థానంవారు. పీపింగ్ టామ్స్ కాబాకండి’- అని కూడా హితవు పలికారు కోర్టువారు.
ముంబాయి డాన్స్‌బార్‌లు దాదాపు ఏడువందల దాకా వున్నాయి. కానీ వాటిని మూయించేశారు. మహారాష్టల్రోని యితర నగరాలలో కొన్ని వందలున్నాయి. వాటినీ కూడా మూయించేశారు- రీజనల్ సర్కారువారు. పైగా ‘బార్ డ్యాన్సర్ల’కి ‘‘బార్ బాలలు’’, ‘‘బార్‌గాళ్స్’’అంటూ చక్కని పేరుకూడా పెట్టారు. ఈ ‘‘బార్‌బాలల’’ వృత్తిలో లక్షన్నర మందిదాకా సుందరాంగనలున్నారుట! ఇంకా కొన్నివేల మంది యితరులు ఆధారపడి వున్నారు. కనుక వీటిని బ్యాన్‌చేస్తే, వారికి వేరే జీవన మార్గం చూపించకపోతే- అదో క్రయిమ్ అన్నారు లీగల్ పండిట్స్. కాని మహారాష్ట్ర సర్కారు పట్టువిడవని విక్రమార్కుడి లాగ - ఈ డ్యాన్స్ బాలల్లో స్థానికులు ఐనవారికి మాత్రం భృతి కల్పిస్తామని అన్నారు. కానీ మర్చిపోయారు. బార్ డ్యాన్సర్లకి అధమ పక్షం పదివేలనుంచి, రెండుమూడు లక్షలదాకా నెలాఖరున ఆదాయం వుంటుంది. అంచేత నేపాల్, దుబాయ్, వైజాగ్, చెన్నై, హైద్రాబాద్‌ల నుంచి కూడా నర్తకీమణులు ఎగబడ్డారు. ఈ కోర్టు-గవర్నమెంట్ల మధ్య సిగపట్లు చూసి చాలామంది డ్యాన్సర్‌లు స్వస్థలాలకు పోయి, ఏం చేస్తున్నారో పాపం!
అదట్లుండనిండు. ముంబయ్ వాళ్లు అక్కడి రెడ్ లైట్ ఏరియాలోకి కొన్ని కొన్ని భోగమందిరాలలో ‘ముజ్రాలు’యివ్వటానికి పోయారు. ‘సెక్స్‌వర్కర్లు’ అంటూ, వీళ్లకి గవర్నమెంటు ఒక ముద్దుపేరు పెట్టింది. ‘‘కాయకష్టం చేసే కార్మికులలాగే వీళ్లుకూడా ‘‘శరీర కష్టమేగా చేస్తారు’’-అంటూ ఒక ఎక్స్‌పర్ట్ కామెంటేటర్ వ్యాఖ్యానించాడు గానీ బార్‌గాళ్స్ సెక్సువర్కర్లుగా మారిపోతున్నారు కనుక బార్ డ్యాన్సులను తక్షణం మొదలుపెట్టండి’’- అన్నది అభ్యుదయ ‘కాముకుల’ చిరు కోరిక.
‘‘సి.సి. కేమెరాలు ఎందుకొద్దన్నామంటే, రుూ డ్యాన్స్‌లను పోషించటానికి వచ్చే రాజపోషకులుంటారు. ‘కరెన్సీ-నోట్ల దండలూ’’ తెస్తారు. నర్తకీమణులు వీరిదగ్గరిగా వచ్చి యిలా వాలి, కనులు కనులు కలిపేవేళ - సదరు సరసుడు తన చేతనున్న కరెన్సీ మాల ఆమె మెడలో వేస్తాడు- కొందరు అయిదు రూపాయలు, పది రూపాయల కాగితాలు యిలా పూలు విసిరినట్లు- ఐటమ్‌సాంగ్ గాళ్స్ మీదికి ‘వహ్వా’లతో కలిపి విసురుతారు. ఇందులో ‘‘పెద- బాబులుంటారు. సిన బాబులుంటారు. కాపులుంటారు. కరణాలుంటారు’-అన్న ‘‘సిట్టెమ్మో’’ జానపద పాటలో లాగా- విఐపిలు, వి.వి.ఐ.పిలు, అధోజగత్ కిలాడీలు పరివేష్టించి వుండగా- వాళ్ల నిజ స్వరూపాలను సి.సి.కేమెరాలు బంధించితే ఎట్లా? వాళ్లురారు. రాపోతే దివాళా!
నర్తకీమణులు అంటే బార్ బాలికలు- సాధారణంగా సినిమా ఐటమ్‌గాళ్ కన్నా సభ్యమైన దుస్తులే ధరిస్తారు. ఐతే కొత్త రూల్సు ప్రకారం వీపు నగ్నంగా (బ్యాక్‌లెస్ చోళీ) చూపెట్టొచ్చును గానీ ముందుకు తిరిగి ఒంపులు, కులుకులు వొలకపోయరాదు. లెహంగాలు (లంగాలు) మోకాళ్లకి కాస్త మాత్రం పైకి వుంచుకోవాలి. అంతే ప్యాంటీలతో రారాదు. సాధారణంగా వీళ్లు సినిమా సాంగ్ ట్రాక్ పెట్టుకుని రికార్డింగ్ డ్యాన్సు చేస్తారు. సదరు సినిమాలో స్టార్స్ ధరించిన - ‘సబ్ కుఛ్’ ధిక్హ్రాహై’మార్క్ డ్రెస్‌లు బిగించుకోరాదుట!
‘్ఛళీకే పీఛే క్యాహై’ ఆ పాట జ్ఞాపకం వుందిగా- సంజయ్ రామ్‌గోపాల్‌ల సంయుక్త కళాఖండం అందులోని రుూ పాట అప్పట్లో నర్తకీమణులు.. ఓ వూపు వూపి ప్రదర్శించేవాళ్లు. అలాగే బార్‌లలో కరెన్సీ వర్షం కురిస్తే వీళ్లమీద మోజుతో... ఆ డబ్బును - చివర లెక్కెట్టి- రెస్టారెంట్ బాస్- సగం- మిగతాది డ్యాన్సర్‌లకు దామాషాగా పంచుతారు-
చిత్రమేమిటీ అంటే సెన్సారయిన పాటల దృశ్యాలను వీళ్లు సెన్సార్‌ల విభాగాలతో చూపించగలరు. ‘ముజ్రా’ల్లో ‘‘తవాయిఫ్ కచేరీల్లో వుండే ‘జావళీ’ తరహా పాటలు యిక్కడ బార్‌లలో వుండవు. ఈ ఐతే బార్ బాలికలతో మరో రకం వ్యాపారం సాగుతోంది. ఇందులో బడా హస్తాలుంటాయి’- అన్నది పిడికిలి విప్పి చూపించేటంతటి పబ్లిక్ రహస్యమే గానీ, రుూ మాదిరి బార్ డ్యాన్సులు చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, బంగలూరులలో వుండవు. ‘హై.బాద్’ నైట్ లైఫ్ ఖాతాదారులంతా- యువతీయువకులే. పరువంలోని వాళ్లే ఆర్కెస్ట్రాలకు అనుగుణంగా వాళ్లే తెల్లార్లూ తాగి తందనాలాడుతారు. - మూడు పెగ్గులూ- ఆరు స్టెప్పులూగా సాగుతుందిట రుూ సంబరం. కొన్నిచోట్ల జంటగా వస్తేనే నైట్ క్లబ్స్‌లోకి ప్రవేశం. బుధ గురువారాలలో ఒక్కో పబ్ లేదా క్లబ్‌లో కేవలం స్ర్తిలకు మాత్రమే ప్రవేశం వుంటుందిట. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌గారు యిప్పటికీ ‘డ్యాన్స్‌బార్లకు’ కళ్లెంవేయాలని- దానికి చట్టం ఏదైనా తేవాలనీ- అందాకా సుప్రీంకోర్టుకి రివ్యూ పిటిషన్ పెట్టుకుందామని యోచిస్తున్నట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా.
ముంబై నైట్స్ ఆర్ మెన్ట్ఫ్‌ర్ డ్యాన్సింగ్!...