మిర్చిమసాలా

అద్వానీ అంతటి వాణ్ణి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ అంతటి వాణ్ణి..’ అని సిఎల్‌పి నేత, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. ఈ మాటను గొప్పగా చెప్పుకోవడానికి బదులు ఆయన దీనంగా వినిపించడంతో విలేఖరులు విస్తుపోయారు. ‘బిజెపిలో అద్వానీకి మం పేరుంది, కానీ ఏం లాభం? ఉన్నతమైన రాష్టప్రతి పదవికి ఆ యన ఎంపిక కాలేదు కదా!, కాంగ్రెస్‌లో గౌరవం ఉన్న నన్ను కార్యకర్తలు, హైకమాండ్ అంతా ప్రేమిస్తారు.. కానీ ఫలితం ఏమీ లేదు..’ అని జానా తన మనసులోని మాట బయటపెట్టారు. ఇంతకీ ఆయన బాధ వెనుక అసలు కారణం ఏమిటో కాంగ్రెస్ శ్రేణులకే తెలియాలి.
-వి.ఈశ్వర్ రెడ్డి

పదవుల కోసం తహతహ!
వైకాపా నుంచి తెదేపాలోకి వలసల పర్వం ఇంకా కొనసాగడంతో- తన పార్టీ వారిని బుజ్జగించడంలో ఏపి సిఎం చంద్రబాబుకు తలనొప్పి తగ్గడం లేదట! గత ఎన్నికల్లో ఓడిపోయిన, రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న తెదేపా నేతలను సముదాయిస్తూ, వైకాపా వారికి పార్టీ తీర్థం ఇవ్వడంలో ఆయన సతమతమవుతున్నారట! పాతవారిని, పార్టీలో చేరే వారిని సంతృప్తి పరచాలంటే అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం తప్ప మరో మార్గం లేదని గ్రహించిన బాబు- ఈ విషయమై ఇటీవల కేంద్రంపై ఒత్తిడి పెంచారు. కాగా, పొరుగు రాష్ట్రం తెలంగాణలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 31 చేయడంతో పదవుల పంపిణీకి అక్కడి సిఎం కెసిఆర్ మార్గం సుగమం చేసుకున్నారు. జిల్లాల సంఖ్యనైనా పెంచితే పదవుల పంపిణీకి అవకాశం ఉంటుందని ‘తెలుగు తమ్ముళ్లు’ అంటున్నారు.
- నిమ్మరాజు చలపతిరావు

అంకెల గోల..!
ఇపుడు ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరికీ ‘అంకెల గోల’ తప్పడం లేదు. ఏ పని కావాలన్నా ఆధార్ నెంబర్, ‘పాన్’ నెంబర్, ఓటర్ ఐడి నెంబర్, బ్యాంకు ఎకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్.. ఇలా అన్నీ గుర్తుంచుకుని వాటిని పర్సులో నిత్యం పెట్టుకోవాల్సిందే. వాటి జిరాక్స్ కాపీలను అడిగిన చోటల్లా ఇవ్వాల్సిందే. మనశ్శాంతి కోసం ఏ పుణ్యక్షేత్రానికో వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలన్నా గుర్తింపుకార్డులు, వాటి నెంబర్లు చూపాల్సిందే మరి. ఇక రుణం కోసం బ్యాంకుకు వెళ్లినా, బంగారం తాకట్టు పెట్టినా గుర్తింపుకార్డుల గురించి యక్షప్రశ్నలు! ‘ఇన్ని కార్డులు, ఇన్ని నెంబర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి..? టెక్నాలజీ పెరిగినకొద్దీ ఇబ్బందులు పెరుగుతున్నాయ’ని జనం చిరాకు పడుతున్నారు.
- శైలేంద్ర

విశ్వరూపం..
ఎడాపెడా నిబంధనలతో దోచుకునే కార్పొరేట్ కాలేజీలకే కాదు, అక్కడ చదువుకునే విద్యార్థులకూ ఒక రోజు వస్తుందంటే ఇదేనేమో! కూకట్‌పల్లిలోని ఓ ప్రముఖ కార్పొరేట్ కాలేజీలో విద్యార్ధులు విశ్వరూపాన్ని ప్రదర్శించారు. సెలవు రోజుల్లో తమను బయటకు పంపలేదని వారు కం ప్యూటర్లు పగలగొట్టారు, పుస్తకాలు కాల్చేశారు, ట్రాన్స్‌ఫారంను నిలిపివేశారు, వా టర్ ట్యాంకును లీక్ చేశారు. సిబ్బందిని గదిలో బంధించారు. ఇంత బీభత్సం జరిగాక ఎవరైనా ఊరుకుంటారా? కాలేజీ యాజమాన్యం మాత్రం కిక్కురుమనకుండా మా విద్యార్ధులే కదా అంటూ సర్దిచెబుతోంది. ఎందుకిలా..? అందరికీ తెలిసిందే కదా.. అదే ‘పరువు’ సమస్య!
- బివి ప్రసాద్

పోలీసుల అండతో..
బ్యూటీషియన్ శిరీష, కూకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యల కేసులో ఒక విషయాన్ని పోలీస్ శాఖ విస్మరించింది. కూకునూర్‌పల్లికి సమీపంలో వ్యభిచార కేంద్రాలు ఉన్నాయని, అక్కడికి వెళ్లి రావాల్సిందిగా ఎస్‌ఐ తమను వత్తిడి చేసినట్టు కస్టడీలో ఉన్న రాజీవ్, శ్రవణ్‌లు విచారణలో వెల్లడించారు. వ్యభిచార కేంద్రాలు స్థాని క పోలీసుల అండదండలతో కొనసాగుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. నేరాలను మాత్రమే కాదు, మూఢ నమ్మకాలను కూడా రూపుమాపాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఇటీవల తెలంగాణ సిఎం కెసిఆర్ ఓ సమావేశంలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనికి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. తన ఠాణా పరిధిలో వ్యభిచార కేంద్రాలు ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి అండదండలతోనే నడుస్తున్నట్టు ప్రచారమైంది. పోలీసు ఉన్నతాధికారులు ఇకనైనా దృష్టి సారిస్తారా?
-వెల్జాల చంద్రశేఖర్