వీరాజీయం

అందాల జీన్ భామల హైరోడ్డు నఖరాలు! వార్త - వ్యాఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీహార్ ‘హైవే’లమీద అందాల వొయ్యారిలలామాలు, కాలేజీ టీన్స్‌లాగా జీన్స్ ఆపైన టీషర్టులు ధరించి ఓ అరడజను మంది బిలబిల వచ్చి చిన్న కార్లను, మోటారు శకటాలను హైవేమీద ఆపితే? ఆగక చస్తాయా? ‘‘మేం ఎంజీవోలం (అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్), కనె్నపిల్లలకి చదువులు పెళ్ళిళ్ళూ చేయిస్తారు మావాళ్ళు’’ అంటూ ఇంచుమించు వాహన చోదకులను కొన్నిసార్లు తోటి ప్రయాణికుల తనువులు, జేబులు తడిమేసి ‘బై’ చెప్పేస్తున్నారు నేటి సినిమాల్లో ‘ఐటెం డాన్సు గాల్స్’లాంటి అమ్మాయిలు’’.ముజఫ్పరాపూర్ మీదుగా పాట్నాకి పోయే హైవేస్ 15, 25, 77లలో ఈ జీన్ అప్సరసలు దిగడి దారిదోపిడీ చేసేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే బలవంతంగా గుంజుకుంటున్నారు. ముంజేతి గడియారాలు, ఉంగరాలు దోచేస్తున్నారు. నయవంచన లేదా ‘్భయవంచన’ చేస్తున్న ఈ అమ్మాయిలు కాలేజీ ‘టీన్స్ జీన్స్’ కాదు దారి దోపిడీ దొంగలు అని తెలిసేసరికి చాలామంది మధ్యవయస్కులు యువకులు నిలువుదోపిడీకి గురి అయిపోయారు. పోలీసులు ఆలస్యంగా అప్రమత్తమైనారు. ఈ అమ్మాయిలు నీలం లేదా నలుపు జీన్సు వాటిమీద డేనిమ్స్ కాని ఎర్ర టీషర్టులు కాని వేస్తారు. చూపులతో ‘షూట్’ చెయ్యగల వీళ్లకి వేరే ఆయుధాలు ఎందుకు? బీహారుకి 35 కిలోమీటర్ల దూరం హైవే మీద ఆరుగురు భామల్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ముజప్ఫరాపూర్ దగ్గరలో మైరా అనే హోటల్లో వీళ్ళు మకాం పెట్టుకున్నారు. జ్యోతి అనే ఇన్స్‌పెక్టరు వాళ్ల వేషంలోనే పోయి వాళ్ళని చాకచక్యంగా పట్టుకుని గుట్టు రట్టు చేసింది. ఎక్కడో గుజరాత్, పశ్చిమ బంగాల్ అంత దూరం నుంచి వచ్చిన ఈ జీన్‌దారి సాహస అందాల దోపిడీ దొంగలు- దేశ వ్యాప్తగా వున్న ఒక పెద్ద గ్యాంగుల్లో సభ్యులు. బీహారులో ఎక్కువమంది చీరలు డ్రెస్సులు తప్ప జీన్స్, షార్ట్స్ వగైరా అధునాతన దుస్తులు ధరించరు. అంచేత జీన్స్ బాలలు ఓ వింత ఆకర్షణ. అక్కడ మొ దట దొరికిన ఆరుగురి సాయంతో మిగతా ఇరవై నాలుగుమందిని హోటల్స్‌మీద దాడి చేసి పట్టుకున్నామని- వీరి మీద ‘సీతా యాక్టు’ కేసులు 420 పెట్టలేమని క్రింద కేసులు పెట్టాలా? అన్నది యోచన అని పోలీసు అధికారులు చెబుతున్నారు. అరెస్టు చేసిన వారిని ఎక్కడ పెట్టాలో తెలియక హోటల్స్‌లోనే వుంచి పహారా ఏర్పాటుచేయాలనీ కమిషనర్‌గారి యోచన. ఈ బందిపోట్లు అమ్మాయిలలో లాయర్సు కూడా వున్నారు. ‘‘మా కేసు మేమే పోరాడుతాం’’ అంటే? అదీ పోలీసుల సమస్య.

-వీరాజీ