వీరాజీయం

దారికడ్డంగా ‘బర్రెలగోడ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవును అలాగే గేదెని రక్షించాలా? భక్షించాలా? అన్నదో పొలిటికల్ ప్రశ్న కాదు, అది ఒక రాజకీయ ఆయుధంగా అయిపోతోంది దేశంలో.. అట్టి తరి- కబేళాలకి వాటితోపాటు డయరీ ఫారాలకి కూడా గాలి తగిలింది. లైసెన్సు లేనిదే జంతు వధ నిషేధం; అలాగే లైసెన్సు లేనిదే గేదెల పాలు పితికి అమ్ముకోరాదు. మధ్యప్రదేశ్‌లో ఒక జట్టు వుంది. అలా అక్రమంగా 90 డయరీ ఫారాలున్నా యి. వీటికి లైసెన్సులు లేవు. గేదెల రొంపి రొచ్చు అంతా పక్కనున్న నదులలోకి వదలేస్తున్నారు.
హైకోర్టు, సివిల్ అధికారులు పర్యావరణ రక్షణ్ సంఘం అంతా కూడబలుక్కుని- చెప్పారు ఈ ‘గేదెల దొడ్లు’ మూసెయ్యండి అని. వాళ్ళు వినలేదు, లైసెన్సులకు అర్జీలు పెట్టలేదు. జబల్‌పూర్ మున్సిపాలిటీ పోలీసుల్ని వెంటేసుకుని రంగంలోకి దిగింది. ఓ తొమ్మిది భారీ గేదెల దొడ్లను పడగొట్టేసింది. పాల రైతులు ఫాలాక్షులైపోయారు. జబల్‌పూర్ సిహోరా హైవే మీదికి గేదెల మందల్ని, దున్నల్ని వదిలిపెట్టారు. బుల్దోజర్లు, ట్రక్కులు, పోలీసు వ్యానులు అన్నీ రైట్ అబౌట్ టర్న్ కొట్టాయి. గేదెల గోడ ఒక చైనా వాల్‌లాగా కనబడ్డది పోలీసులకి. ఈలోగా పాలవాళ్ళు గేదెలను అడ్డం పెట్టుకుని రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు.
మరికొన్ని నగరాల్లో డైరీ ఫాం సిబ్బంది ఇతరులు కలిసి రోడ్లమీద వేలాది అరటిపండ్లు పరిచేశారు.. కాలు పడ్డదో అంతే సంగతులు.. కాయగూరలు విసిరేశారు- ఇక ‘గేదె-గోడ’ వెనుక నుంచి కాశ్మీర్ అల్లర్ల లెవెల్లో రాళ్ళు, నాటు బాంబులు విసిరినట్లు రువ్వడం గాయాలు తడుముకుంటూ పోలీసులు ‘బులావ్’ అంటూ బాష్పవాయువు దళాల్ని పిలిచి ఎనిమిది రౌండ్లు ప్రయోగించారు.గేదెలని ఎట్టకేలకు దూరంగా తోలగలిగారు సర్కారు భృత్యులు. మొత్తం డైరీ ఫారాల్ని ధ్వంసం చేస్తామంటున్నారు వాళ్ళు. ఎలా చేస్తారు? నోరులేని పశువుల్ని కొట్టి, ఒక కోటి జనాలకి, పసిపిల్లలకి పాలు, వెన్న లేకుండా చేస్తారా? అని వీళ్ళు- అయ్యో, నదులు కాలుష్య నిలయాలు అయిపోతున్నాయి మరి? అని వాళ్ళు- ముఖ్యమంత్రిదాకా వెళ్లింది ఈ గేదెల యుద్ధం వార్త- ‘నేను చూస్తాగా’ అన్నాడాయన. ‘ముర్రా బర్రె’ లేనిదే పాడి సాగునా? మరి రొచ్చు మాటేమిటి? జిఓకె!

-వీరాజీ