S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/06/2015 - 04:56

గౌహతి, డిసెంబర్ 5: అసోం రాజధాని గౌహతిలో అత్యంత జనసమ్మర్థం కలిగిన ఫ్యాన్సీ బజార్‌లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఒక బాంబు పేలిన వెనువెంటనే మరో బాంబు పేలినట్లు పోలీసులు తెలిపారు. ఓల్డ్ జైల్ రోడ్డులోని ఒక మిఠాయి దుకాణం వద్ద చెత్తకుండీలో అమర్చిన బాంబులను పేల్చినట్లు వారు తెలిపారు.

12/06/2015 - 04:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్)కు సంబంధించిన గూఢచార ముఠాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు జమ్మూ-కాశ్మీరుకు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. నిందితుడిని రాజౌరీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సబర్‌గా గుర్తించారు.

12/06/2015 - 04:55

రిజర్వేషన్లపై ప్రకటనలతో బిహార్‌లో ఓడిపోయాం
రామమందిరం అంశంతో యుపిలో ఇబ్బందులే
బిజెపి సీనియర్ నేతల మనోగతం

12/06/2015 - 04:54

మాజీ జర్నలిస్టుకు చోటా షకీల్ హెచ్చరిక

12/06/2015 - 04:54

చెన్నై, డిసెంబర్ 5: సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ శనివారం నగరంలో, చుట్టుపక్కల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అవసరమని భావించినంతవరకు త్రివిధ దళాలు సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తాయని ఆయన చెప్పారు. అవసరమైతే మరిన్ని దళాలు, ఇంజనీరింగ్ పరికరాలు, వైద్య బృందాలను కూడా పంపిస్తామని ఆయన చెప్పారు.

12/06/2015 - 04:53

పుదుచ్చేరి, డిసెంబర్ 5: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 8,955 హెక్టార్ల వరిపంట నష్టమైందని, 11,418 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ రామస్వామి చెప్పారు. పుదుచ్చేరిలో 4,420 హెక్టార్లు, కారైకల్‌లో 4,248.34 హెక్టార్లు, యానాం ప్రాంతంలో 287.15 హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు.

12/06/2015 - 04:52

మరో 2-3 రోజుల్లో వాణిజ్య సర్వీసులు: కేంద్ర మంత్రి వెల్లడి

12/06/2015 - 04:51

చెన్నైలో ఇప్పటికీ వరద నీటిలోనే అనేక ప్రాంతాలు
పాక్షికంగా మొదలైన రైలు, బస్సు సర్వీసులు
ఇంకా ప్రారంభం కాని విమాన సర్వీసులు
పాలు, కూరగాయలు, నీళ్లకు కరవే
ఎటిఎంలు, పెట్రోలు బంకుల వద్ద క్యూలు

12/06/2015 - 04:38

అనాలోచితంగా పర్యావరణ అనుమతులు
ముంపు ప్రాంతాలతో ముప్పు
ఎంపి కెవిపి ఆందోళన
కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు లేఖ

12/06/2015 - 04:37

అరక్కోణం, డిసెంబర్ 5: వర్షాల తాకిడికి జలమయంగా మారిన చెన్నై మహానగరం నుంచి మరో 400 మంది బాధితులను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రక్షించి హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు తరలించాయి. అరక్కోణం నావల్ ఎయిర్ బేస్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏసి-17 గ్లోబ్ మాస్టర్ ద్వారా 172 మందిని ఢిల్లీకి చేర్చారు.

Pages