S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/16/2016 - 02:18

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: రైల్వే బెర్త్‌లు, సీట్లు కేటాయించడంలోనూ అలాగే టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి నుంచి పెద్ద ఎత్తున లంచాలు మరిగారని దీనివల్ల రైల్వేలకు తీవ్రస్థాయిలో రెవిన్యూ నష్టం వస్తోందని తాజాగా జరిగిన ఓ సర్వేలో 62 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.

02/16/2016 - 02:15

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రణక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన సియాచిన్‌లో ఇటీవల సజీవ సమాధి అయిన తొమ్మిది మంది వీర సైనికుల భౌతికకాయాలను సోమవారం న్యూఢిల్లీ నుంచి తమ సొంత రాష్ట్రాలకు తరలించారు.

02/16/2016 - 02:14

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 15: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా నడిచేలా చూసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 23నుంచి ప్రారంభం అవుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయి.

02/16/2016 - 02:13

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగడానికి వీలుగా అదనపు బలగాలను తరలించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు కేంద్ర సాయుధ బలగాలు పంపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నాయకత్వాన బిజెపి ప్రతినిధి బృందం సోమవారం ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందించింది.

02/16/2016 - 02:13

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: విశ్వభారతి వర్శిటీ వైస్ చాన్సలర్ పదవి నుంచి సుశాంత దత్తా గుప్తాను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. ఓ సెంట్రల్ యూనివర్శిటీ విసికి ఉద్వాసన పలకడం అన్నది దేశంలో ఇదే మొదటిసారి. దత్తా గుప్తాకు ఉద్వాసన పలకాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

02/16/2016 - 02:13

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రాంతీయ భద్రత, ఆర్థిక సంబంధాలే ప్రధాన అజెండాగా భారత్-ఆసియాన్‌ల మధ్య బుధవారం నుంచి రెండు రోజుల పాటు శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఈ ఎనిమిదో సమావేశానికి ఆసియాన్ దేశాలకు చెందిన అధినేతలు హాజరవుతున్నారని విదేశాగం మంత్రిత్వశాఖ కార్యదర్శి అనిల్ వాద్వా వెల్లడించారు.

02/16/2016 - 02:12

పాట్నా/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఢిల్లీలోని జెఎన్‌యులో ఇటీవల జరిగిన అఫ్జల్‌గురు సంస్మరణ కార్యక్రమం వెనక లష్కరే తొయిబా అధినేత హఫీజ్ సరుూద్ హస్తం ఉందంటూ హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై రెండోరోజైన సోమవారం కూడా తీవ్రస్థాయిలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలంటూ ఇటు రాజకీయ రంగానికి, అలాగే ఇతర రంగాలకు చెందిన అనేకమంది హోమ్ మంత్రిపై వత్తిడి తీసుకొస్తున్నారు.

02/16/2016 - 02:12

గోపూర్ (అస్సాం), ఫిబ్రవరి 15: కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బిజెపితో పాటు దాని మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

02/16/2016 - 02:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: జెఎన్‌యు వివాదంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం ద్వారా రాహుల్ గాంధీ తన మదిలో దేశ ప్రయోజనాలకు చోటులేదని నిరూపించుకున్నారని అమిత్ షా విమర్శించారు. వేర్పాటువాద శక్తులతో చేతులు కలిపిన రాహుల్ గాంధీ మరోసారి దేశ విభజన జరగాలని కోరుకుంటున్నారా? అని ఆయన నిలదీశారు.

02/16/2016 - 01:17

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దళితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు ప్రతాప్‌కుమార్ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఏ పోలీస్ స్టేషన్లలోనూ కేసు నమోదు చేయడం లేదని, దళిత వ్యతిరేక వ్యాఖ్యలపై సీబీఐ దర్యాప్తు జరిపేలా చూడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Pages