S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/17/2016 - 16:36

న్యూదిల్లి:అరుణాచల్ ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వివిధ పార్టీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో రాష్టప్రతిపాలనకు తెరవేసేందుకు కేంద్రప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని రాష్టప్రతికి సిఫారసు చేసినట్లు తెలిసింది.

02/17/2016 - 16:18

దిల్లీ: దేశద్రోహం కేసులో పోలీసులు అరెస్టు చేసిన జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌ను ఇక్కడి పటియాలా హౌస్ కోర్టు వద్దకు తీసుకువచ్చిన సందర్భంగా బుధవారం మళ్లీ ఘర్షణలు చెలరేగి ఉద్రిక్తతకు దారితీసింది. తమపై కొందరు లాయర్లు దాడిచేశారని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. లాయర్లు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. కన్నయ్యకుమార్‌పై కొందరు న్యాయవాదులు దాడి చేశారని సమాచారం.

02/17/2016 - 12:09

దిల్లీ: నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో ఇటీవలి ఘర్షణల నేపథ్యంలో 13 మంది పోలీసులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దేశద్రోహం కేసులో జెఎన్‌యు విద్యార్థి కన్నయ్య కుమార్‌ను కొద్దిరోజుల క్రితం పాటియాలా హౌస్‌లోని కోర్టులో హాజరు పరచినప్పుడు విద్యార్థులు, అధ్యాపకులు, జర్నలిస్టులపై న్యాయవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే.

02/17/2016 - 12:03

భువనేశ్వర్: నల్గొండ జిల్లాకు చెందిన పోలీసులు ఒడిశా పోలీసుల సహకారంతో రౌర్కెలాలోని ఓ ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి దాడిచేసి నలుగురు సిమి ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య సుమారు మూడు గంటలసేపు కాల్పులు జరిగాయి. గత ఏడాది నల్గొండ జిల్లా కోదాడలో కాల్పుల సంఘటనతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు రౌర్కెలాలో తలదాచుకున్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది.

02/17/2016 - 08:25

న్యూఢిల్లీ: పటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో విలేఖర్లపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం న్యూఢిల్లీలో వందలాది మంది పాత్రికేయులు, జాతీయ ప్రచార మాధ్యమాలకు చెందిన పలువురు సంపాదకులు కదం తొక్కారు.

02/17/2016 - 08:23

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలోని 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలు 7 స్థానాలను దక్కించుకుని అధిక్యతను చాటడంతో పాటుగా ఉత్తరప్రదేశ్, కర్నాటకలో అధికార పార్టీని దెబ్బతీసి లబ్ధి పొందింది. కాగా, ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ ఫలితాలనిచ్చాయి.

02/17/2016 - 08:21

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే ఉండడంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బిజెపి కూటమిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఒక కూటమిగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా రాష్ట్రంలో తన పలుకుబడిని విస్తరింపజేసుకోవడానికి బిజెపి శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

02/17/2016 - 08:20

న్యూఢిల్లీ: దేశద్రోహ కేసులో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘ (జెఎన్‌యుఎస్‌యు) నాయకుడు కన్హయ్య కుమార్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఆ వర్శిటీ అధ్యాపకులు మంగళవారం తరగతులను బహిష్కరించి విద్యార్థుల సమ్మెలో పాల్గొన్నారు. అంతేకాకుండా ‘జాతీయవాదం’పై ఇకమీదట వర్శిటీ ఆవరణలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు.

02/17/2016 - 08:20

జమ్మూ: జెఎన్‌యులో వివాదం సృష్టించిన కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని ప్రభుత్వంపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విమర్శించారు. దేశం ఉనికిని ప్రశ్నించడం అన్నది దేశ ద్రోహం కిందకే వస్తుందని మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు.

02/17/2016 - 08:19

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మొండి బకాయిలు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతుండటం పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులకు రూ.500 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తంలో రుణాలను ఎగ్గొట్టిన సంస్థల జాబితాను సమర్పించాలని సుప్రీం కోర్టు మంగళవారం రిజర్వు బ్యాంకును ఆదేశించింది.

Pages