S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/24/2016 - 04:15

న్యూఢిల్లీ: ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారంలో భాగంగా విదేశాలనుంచి వ్యాపారవేత్తల రాకను సలభతరం చేసేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌ఢిఐ) తీసుకు వచ్చే విదేశీయులకు దీర్ఘకాలిక వీసా లేదా రెసిడెన్సీ పర్మిట్‌ను ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

02/23/2016 - 17:49

దిల్లీ: దేశద్రోహం కేసులో నిందితులైన అయిదుగురు జెఎన్‌యు విద్యార్థులు తాము పోలీసులకు రహస్య ప్రాంతంలో లొంగిపోయేందుకు అనుమతించాలని దిల్లీ హైకోర్టును కోరారు. అయితే వీరి విజ్ఞప్తిని న్యాయస్థానం త్రోసిపుచ్చింది. అందరికీ తెలిసేలా విద్యార్థులు లొంగిపోతే ఆ క్షణంలో వారిపై దాడులు జరిగే అవకాశం ఉందని నిందితుల తరఫు లాయర్లు చేసిన వాదనను కోర్టు అంగీకరించలేదు.

02/23/2016 - 17:47

జైపూర్: ఇన్నాళ్లూ హర్యానాకే పరిమితమైన జాట్ కులస్థుల విధ్వంసకాండ ఇపుడు రాజస్థాన్‌కు విస్తరించింది. రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న జాట్ కులస్థులు మంగళవారం రాజస్థాన్‌లోని హిలాక్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్సుకు నిప్పుపెట్టారు. పప్రిరా స్టేషన్‌లో టిక్కెట్ బుకింగ్ కౌంటర్‌ను ధ్వంసం చేసి స్టేషన్ మాస్టర్‌పై దాడి చేసి, 5వేల రూపాయల నగదును దోచుకున్నారు.

02/23/2016 - 16:30

పాట్నా: జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయ్యకుమార్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన సొంత జిల్లా బెగుసరాయ్ (బిహార్)లో వామపక్ష పార్టీలు మంగళవారం బంద్ నిర్వహిస్తున్నాయి. జాతీయ రహదారిని ఆందోళనకారులు నిర్బంధించారు. కన్నయ్యపై దేశద్రోహం కేసు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.

02/23/2016 - 16:28

చండీగఢ్: జాట్ కులస్థుల ఆందోళనలతో అట్డుడుకుతున్న రోహ్తక్ పట్టణంలో హర్యానా సిఎం ఖట్టర్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో జాట్ కులస్థులు రోహ్తక్‌లో భారీ విధ్వంసానికి దిగడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు సిఎం వచ్చారు. ఆయనను ఆందోళనకారులు అడ్డగించి నిరసనకు దిగారు. విధ్వంసంలో ఆస్తులను కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

02/23/2016 - 16:26

దిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల ఐకాస నేతృత్వంలో మంగళవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది. దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలని వారు నినాదాలు చేశారు. ధర్నాకు ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. రోహిత్ తల్లి కూడా ధర్నాలో పాల్గొన్నారు.

02/23/2016 - 13:37

దిల్లీ: దేశ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎనె్నన్నో పథకాలను అమలు చేస్తున్నదని, ప్రగతి పథంలో లక్ష్యాలను చేరుకునేందుకు కృషి జరుగుతోందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మంగళవారం ఉదయం ఉభయ సభలనుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. రైతు సంక్షేమంతోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందన్నారు.

02/23/2016 - 12:01

దిల్లీ: జాట్ కులస్థులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించేందుకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఇద్దరు మంత్రులతో కలిసి మంగళవారం ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. జాట్‌లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఏర్పాటు చేసిన కమిటీతో సి.ఎం. భేటీ అవుతారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.

02/23/2016 - 11:57

దిల్లీ: దేశ ద్రోహం కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను దిల్లీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కన్నయ్య మద్దతుదారులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

02/23/2016 - 11:56

దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పార్లమెంటు భవన్ వద్ద రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అన్సారీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు తదితరులు స్వాగతం పలికారు.

Pages