S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/20/2016 - 07:00

న్యూఢిల్లీ, మార్చి 19: దేశద్రోహం కేసులో అరెస్టయిన ఢిల్లీ యూనివర్శిటీ అధ్యాపకుడు ఎస్‌ఎఆర్ గిలానీకి ఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జి దీపక్ గర్గ్ బెయిల్ మంజూరు చేశారు. గత నెలలో ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ప్రెస్‌క్లబ్ గిలానీ పేరుతోనే బుక్ అయింది.

03/20/2016 - 06:58

లాస్ ఏంజెలిస్, మార్చి 19: అమెరికాలోని లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పైలట్ రహిత డ్రోన్ ఒకటి లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెట్ విమానానికి 200 అడుగుల సమీపంలోకి వచ్చింది. విమానాశ్రయంలో దిగుతున్నప్పుడు మధ్యాహ్నం 1.30 గంటలకు డ్రోన్ ఒకటి తమ విమానంపైగా వెళ్లిందని పైలట్ తెలియజేశాడని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ పాలనా విభాగం ప్రతినిధి ఇయాన్ గ్రెగర్ చెప్పారు.

03/20/2016 - 06:57

వాషింగ్టన్, మార్చి 19: దుబాయ్, చైనా తదితర దేశాలతో పోలిస్తే వౌలిక వసతుల రంగంలో అమెరికా ఎంతో వెనుకబడి తృతీయ ప్రపంచ దేశంగా ఉందని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ (69) ఆవేదన వ్యక్తం చేశాడు. తనను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే దేశ రూపురేఖలను సమూలంగా మార్చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు.

03/20/2016 - 06:53

న్యూఢిల్లీ, మార్చి 19: వివాదంలో చిక్కుకున్న న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)కి కొత్త రిజిస్ట్రార్‌ను నియమించారు. ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న భూపీందర్ జుట్షీ పదవీ కాలం ఈ నెల 31న ముగియనుండటంతో ఆయన స్థానంలో నియమించేందుకు ఢిల్లీ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రమోద్ కుమార్‌ను త్రిసభ్య కమిటీ ఎంపిక చేసింది.

03/20/2016 - 06:52

న్యూఢిల్లీ, మార్చి 19: దేశంలో కోటికిపైగా ఉన్న బీడీ కార్మికులకు ఇఎస్‌ఐ ద్వారా వైద్యసేవలు అందించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ నిర్ణయించారు. కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని 12 ఆసుపత్రులు, 292 డిస్పెన్సరీలను ఇఎస్‌ఐ పరిధిలోకి తీసుకుస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయా ఆసుపత్రులు, డిస్పెన్సరీ లన్నింటిలో ఇక మీదట బీడీ కార్మికులకు వైద్యసేవలు అందుతాయని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

03/19/2016 - 17:09

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సిఎం హరీష్ రావత్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో రాజకీయ సంక్షోభం ముదురుపాకాన పడింది. రావత్‌కు అసెంబ్లీలో బలం లేదని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బిజెపి సభ్యులు వాదిస్తున్నారు. కాగా, తనకు తగినంతమంది మద్దతుదారులున్నారని రావత్ వాదిస్తున్నారు. 35 మంది ఎమ్మెల్యేలు బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను, రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు దిల్లీ చేరుకున్నారు.

03/19/2016 - 17:07

కోల్‌కత: కోల్‌కతలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్ స్టేడియంలో భారత్-పాక్ జట్ల మధ్య ఈరోజు రాత్రి క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. దాయాదుల మధ్య జరిగే మ్యాచ్‌ను వీక్షించేందుకు వేలాదిమంది క్రీడాభిమానులు ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేశారు. కోల్‌కతలో ఉదయం నుంచి కురిసిన వర్షం మధ్యాహ్నం సమయానికి ఆగిపోయినప్పటికీ, మ్యాచ్ జరిగేందుకు పిచ్ అనుకూలిస్తుందా? లేదా?

03/19/2016 - 13:57

దిల్లీ: దేశవ్యాప్తంగా రైతులకు ఆదాయం పెరిగేలా తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన శనివారం నగరంలో జరిగిన కృషి ఉన్నతి మేళాలో ప్రసంగిస్తూ, రైతులకు మేలు జరిగేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. పంటలకు సమృద్ధిగా నీరు అందితేనే రైతులు సంతోషంగా ఉంటారని, వేసవిలోనూ సాగునీరు తగినంతగా అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

03/19/2016 - 12:31

హైదరాబాద్: ఎపి రాజధాని అమరావతిలో ప్రపంచం గర్వించేలా హైకోర్టు భవనాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం నగరంలో న్యాయాధికారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉండాలన్నారు. భవిష్యత్‌లో కోర్టుల్లో అన్ని వ్యవహారాలు ఆధునిక టెక్నాలజీ సాయంతో నడుస్తాయన్నారు.

03/19/2016 - 12:30

కోల్‌కత: కోల్‌కత నగరంలో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. నగరంలోని ఈడెన్ గార్డెన్ మైదానంలో భారత్-పాక్ జట్ల మధ్య ఈ రోజు రాత్రి క్రికెట్ పోటీ జరగాల్సిన నేపథ్యంలో వర్షం కురియడంతో క్రీడాభిమానుల్లో ఆందోళన నెలకొంది. రాత్రి కూడా వర్షం కురిస్తే మ్యాచ్ పరిస్థితి ఏమిటన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

Pages