S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/28/2016 - 13:03

నెల్లూరు : పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి 33 వాహక నౌక నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి గురువారం మధ్యాహ్నం 12.50గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహక నౌక చివరి ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ఉపగ్రహం బరువు 1,425 కిలోలు.

04/28/2016 - 12:51

హైదరాబాద్: రాజోలిబండ సాగునీటి ప్రాజెక్టు ఆధునీకరణ విషయమై కర్నాటక నీటిపారుదల శాఖామంత్రి పాటిల్‌తో చర్చించేందుకు తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి గురువారం బెంగళూరు చేరుకున్నారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై వీరు చర్చలు జరుపుతారు.

04/28/2016 - 04:44

శ్రీరాంపోర్, ఏప్రిల్ 27: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, మూడింట రెండు వంతుల మెజారిటీతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్, బిజెపి, సిపిఎం అరకొర సీట్లతోనే సరిపెట్టుకోవల్సి వస్తుందని అన్నారు.

04/28/2016 - 04:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంపై రాజ్యసభ బుధవారం భగ్గుమంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ముడుపులు ముట్టాయంటూ బిజెపి సభ్యుడు సుబ్రమణ్య స్వామి ఆరోపించడంతో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకువచ్చి గొడవకు దిగారు.

04/28/2016 - 04:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27:ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ, రాజ్యాంగ సంక్షోభ పరిస్థితి బుధవారం కొత్త మలుపు తిరిగాయి. ఉత్తరాఖండ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై తాము తీర్పు వెలువరించే వరకూ రాష్టప్రతి పాలన కొనసాగుతుందని తాజా రూలింగ్‌లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే శుక్రవారం జరగాల్సిన హరీశ్ రావత్ బలపరీక్షపైనా స్టే విధించింది.

04/27/2016 - 17:53

దిల్లీ: అరకులో ఉత్పత్తి చేస్తున్న కాఫీకి భౌగోళిక గుర్తింపుతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఈరోజు ఇక్కడ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అరకులో మోదీ ఒక్కసారి పర్యటిస్తే టూరిజం రంగంలో మరింత అభివృద్ధి వస్తుందన్నారు. విశాఖ- అరకు మధ్య త్వరలో ప్రవేశపెట్టే అద్దాల రైలు ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆమె ప్రధానిని ఆహ్వానించారు.

04/27/2016 - 17:51

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న డిఎండికె పార్టీ అధినేత, సినీ నటుడు బుధవారం విల్లుపురం జిల్లా ఉళుందూర్‌పేటలో నామినేషన్ దాఖలు చేశారు. ఉళుందూర్‌పేట నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న ఆయనకు కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు.

04/27/2016 - 17:51

దిల్లీ: ఉత్తరాఖండ్‌లో వచ్చే నెల 3వ తేదీ వరకూ రాష్టప్రతి పాలన కొనసాగించాలని సుప్రీం కోర్టు బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. కేసు తదుపరి విచారణ కూడా 3వ తేదీకి వాయిదా పడింది. ఈ నెల 29న అసెంబ్లీలో విశ్వాసపరీక్ష జరపవద్దని కోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ నైనిటాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

04/27/2016 - 17:26

దిల్లీ: కాలుష్య నియంత్రణ కోసం ప్రస్తుతం దిల్లీలో అమలులో ఉన్న సరి-బేసి వాహన విధానాన్ని పాటిస్తూ భాజపా ఎంపీ మనోజ్‌ తివారీ సైకిల్‌పై పార్లమెంటుకు వెళ్లారు. ‘ఈ రోజు బేసి సంఖ్య కార్లు మాత్రమే వాడాలి. అందుకే సైకిల్‌పై వచ్చాను. సైకిల్‌ తొక్కడంలో ఇబ్బందేమీ లేదు. సైక్లింగ్‌ చాలా ఆరోగ్యకరం’ అని తివారి పేర్కొన్నారు.

04/27/2016 - 15:40

దిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో అవకతవకలపై ఇటలీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతి తమ వద్ద ఉందని, దాన్ని ఇంగ్లీష్‌లోకి అనువదించే పని జరుగుతోందని రక్షణమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆ కుంభకోణంలో భారత మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ దోషి అని ఇటలీ కోర్టు తాజాగా తీర్చు ఇచ్చింది.

Pages