S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/29/2016 - 13:58

దిల్లీ: బొగ్గు గనుల కుంభకోణంలో అప్పటి కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ సిఎం మధు కోడా, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌తో పాటు మొత్తం 13 మందిపై చార్జిషీట్లు దాఖలు చేయాలని ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

04/29/2016 - 12:46

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యకళాశాలల్లో అడ్మిషన్లకు జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్ష (నీట్)ను అన్ని రాష్ట్రాలూ విధిగా నిర్వహించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం శుక్రవారం నాడు రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్నందున ‘నీట్’ నుంచి కొన్ని రాష్ట్రాలకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రం కోరుతోంది. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉంది.

04/29/2016 - 12:44

లండన్: తనను అప్రతిష్టపాలు చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తనను అరెస్టు చేసి స్వదేశానికి తీసుకువెళ్లినా తన నుంచి డబ్బులు మాత్రం రాబట్టలేరని లండన్‌లో ఉంటున్న కింగ్‌ఫిషర్ యజమాని విజయ్ మాల్యా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మాల్యాను తమకు అప్పగించాలని లండన్‌లోని భారత రాయబారి కార్యాలయం ద్వారా బ్రిటన్ సర్కారుకు కేంద్రం విజ్ఞప్తి చేసింది.

04/29/2016 - 12:43

దిల్లీ: అగస్టా-వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఇక్కడి స్వామి ఇంటిముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేసి హడావుడి సృష్టించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అరెస్టు చేశారు.

04/29/2016 - 12:42

దిల్లీ: ఎపి ప్రభుత్వం తగిన వసతి సౌకర్యాలు కల్పించనందునే హైకోర్టు ఏర్పాటులో అనివార్యమైన జాప్యం జరుగుతోందని కేంద్ర న్యాయశాఖామంత్రి సదానంద గౌడ శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. అన్ని వసతులూ సమకూరిస్తే ఉమ్మడి హైకోర్టును విభజించడం సులువవుతుందన్నారు.

04/29/2016 - 05:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: వెండి యేతర ఆభరణాలపై విధించిన ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. విలాస వస్తువులను ఈ పన్ను పరిధి నుంచి తొలగించే ప్రసక్తే లేదని ప్రభుత్వం గురువారం రాజ్యసభలో స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

04/29/2016 - 05:45

సూళ్లూరుపేట, ఏప్రిల్ 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ట మరో సారి ఇనుమడించింది. ఇస్రో నమ్మిన బంటు పిఎస్‌ఎల్‌వి రాకెట్ల విజయ పరంపరలు షార్‌లో కొనసాగుతున్నాయి. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఉత్సాహం ఉరకలేయడంతో పాటు విజయగర్వం తొణికిసలాడుతోంది.

04/29/2016 - 05:44

సూళ్లూరు పేట, ఏప్రిల్ 28: నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి గురువారం మధ్యాహ్నం తాజాగా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి రాకెట్‌తో మనకంటూ సొంత దిక్సూచి వ్యవస్థకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఉపగ్రహ బరువు 1425కిలోలు. ఇది 12సంవత్సరాలు పాటు సేవలు అందించనుంది. భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నావిగేషన్ సిరీష్‌లో ఇది చివరిది.

04/29/2016 - 05:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: చేనేత కార్మికులను మహత్మా గాంధీ జాతీయ ఉపాధి కల్పనా హామీ పథకం పరిధిలోకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కిష్టప్ప గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు.

04/29/2016 - 05:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: తీవ్రమైన తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని తెలుగుదేశం సభ్యుడు సిహెచ్ మల్లారెడ్డి ఎన్‌డిఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డి గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో తెలంగాణలో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్య గురించి ప్రస్తావించారు.

Pages