S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/19/2016 - 08:01

న్యూఢిల్లీ, మే 18: ప్రతిష్ఠాత్మక జాతీ య స్థాయి విద్యాసంస్థలయిన ఐఐటిలలో తమ పిల్లలను చదివించాలన్న తల్లిదండ్రుల ఆశలను, విద్యార్థుల ఆకాంక్షలను సొమ్ము చేసుకుంటున్న కోచింగ్ సెంటర్ల దోపిడీని అడ్డుకోవడానికి, ఈ కోచింగ్ జాడ్యాన్ని నిరోధించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డి) నడుంబిగించింది.

05/19/2016 - 08:00

న్యూఢిల్లీ, మే 18: ప్రపంచంలోని అత్యంత ఎక్కువ కాలుష్యం గల వంద నగరాలలో 30కి పైగా నగరాలు భారతదేశంలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ బ్ల్యుహెచ్‌ఒ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రజలను త ప్పుదారి పట్టించేదిగా ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. అమెరికా, యూరప్‌లోని ప్రధాన దేశాలలో వాయు కాలుష్య గణాంకాలను భారత్ త్వరలో ప్రపంచం ముందు ఉంచుతుందని ఆయన వెల్లడించారు.

05/19/2016 - 07:59

న్యూఢిల్లీ, మే 18: ఉగ్రవాదంపై పోరులో చైనా గనుక భారత్‌తో చేతులు కలిపితే దాని ప్రభావమే వేరుగా ఉంటుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజర్‌ను ఐక్యరాజ్య సమితి నిషేధిత ఉగ్రవాద జాబితాలో ఉంచడానికి జరిపిన యత్నాలను చైనా ఇటీవల అడ్డుకున్న నేపథ్యంలో రాష్టప్రతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘్భరత్, చైనాలు రెండూ చాలా పెద్ద దేశాలు.

05/19/2016 - 07:58

న్యూఢిల్లీ, మే 18: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వం మరోసారి కేంద్రంపై ఘర్షణకు తలపడబోతోంది. ఢిల్లీకి రాష్టప్రతి ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాం డ్ కేజ్రీవాల్ మళ్లీ తెరమీదకు తీసుకొస్తున్నారు. పోలీసు, భూములు, అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర పరిధిలోకి తీసుకురావలన్న డిమాండ్ ఆప్ ప్రభుత్వం ఓ ముసాయిదా బిల్లు రూ పొందించింది. బిల్లుపై ప్రజాభిప్రాయాన్ని కోరింది.

05/19/2016 - 07:55

ముంబై, మే 18: దేశంలోని అన్ని ప్రధానమైన ప్రభుత్వ ఆస్తులన్నింటికీ ‘గాంధీ’ల కుటుంబీకుల పేర్లే ఎందుకు పెట్టాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ తీవ్రంగా స్పందించారు. బుధవారం తన ట్విట్టర్ అకౌంట్‌లో వరుస ట్వీట్‌లతో కాంగ్రెస్ పరిపాలన కాలంలో ‘గాంధీ’ కుటుంబీకుల పేర్లను ప్రతీ వ్యవస్థకు పెట్టడాన్ని విమర్శించారు.

05/19/2016 - 06:53

న్యూఢిల్లీ, మే 18: దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో నీట్ అమలుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది.సుప్రీం కోర్టు అదేశించినట్టుగా ఇప్పటికిప్పుడే నీట్‌ను అమలు చేయలేమని అనేక రాష్ట్రాలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కేంద్రం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.

05/20/2016 - 03:15

న్యూఢిల్లీ, మే 18: దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

05/19/2016 - 06:49

న్యూఢిల్లీ, మే 18: కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలోనే పునర్ వ్యవస్థీకరించనున్నట్లు తెలుస్తోంది. గురువారం నాడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసోంలో బిజెపి విజయం సాధిస్తే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి సర్బానంద సోనోవాల్ కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకోవలసి ఉంటుంది.

05/18/2016 - 16:22

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో గురువారం జరిగే కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల లోపే రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది.

05/18/2016 - 16:21

గాంధీనగర్: గుజరాత్‌లోని గోద్రా వద్ద 14 ఏళ్ల క్రితం జరిగిన రైలు దగ్ధం ఘటనలో ప్రధాన నిందితుడైన ఫరూఖ్ భానాను ఉగ్రవాద వ్యతిరేక బృందం బుధవారం అరెస్టు చేసింది. 14 ఏళ్లుగా తప్పించుకుతిరుగుతున్న ఫరూఖ్‌ను కలోల్ టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేయడం గుజరాత్‌లో సంచలనం కలిగించింది. 2002 ఫిబ్రవరిలో గోద్రా స్టేషన్ సమీపంలో దుండగులు సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టగా 60 మంది మరణించారు.

Pages