S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/19/2016 - 13:27

కోల్‌కత: వరసగా రెండోసారి తన పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అఖండ విజయం చేకూర్చారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు తిరుగులేని ఆధిక్యత లభించడంతో ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు.

05/19/2016 - 13:21

దిల్లీ: అస్సాంలో తొలిసారిగా బిజెపికి ప్రజలు అండగా నిలిచి ఆధిక్యత కట్టబెడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీని గెలిపిస్తున్నందుకు బిజెపి సిఎం అభ్యర్థి, కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్‌కు ఫోన్ చేసి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అస్సాం ప్రజల నమ్మకాన్ని తాము నిలబెట్టుకుంటామని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు.

05/19/2016 - 12:17

దిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో అభినందించారు. జయ, మమతలకు ఆయన స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

05/19/2016 - 12:17

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ భారీ ఆధిక్యత దిశగా కొనసాగుతోంది. బెంగాల్ అసెంబ్లీలో 294 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గురువారం కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటికి ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 208 చోట్ల, లెఫ్ట్‌ఫ్రంట్ 28 స్థానాల్లో, కాంగ్రెస్ 41 చోట్ల, బిజెపి 6 స్థానాల్లో ఆధిక్యతతో ఉన్నాయి.

05/19/2016 - 12:16

గౌహతి: ఈశాన్య రాష్టమ్రైన అస్సాంలో బిజెపి తొలిసారిగా సత్తా చాటుతోంది. పోలింగ్ రోజున జరిగిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే ఫలితాలు వెలువడుతున్నాయి. అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా బిజెపి 83 చోట్ల, కాంగ్రెస్ 24 చోట్ల, ఎఐయుడిఎఫ్ 11 స్థానాల్లో, ఇతరులు 8 చోట్ల ఆధిక్యత చూపుతున్నారు.

05/19/2016 - 11:22

తిరువనంతపురం: కేరళలో ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే వెలువడుతున్నాయి. కేరళ అసెంబ్లీలో 80 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ 11 స్థానాల్లో విజయం సాధించగా ఆధిక్యంలో సాగుతోంది. యూడీఎఫ్‌ రెండు స్థానాల్లో విజయం సాధించగా 44స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా ఒక స్థానంలో, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

05/19/2016 - 12:40

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడిఎంకె పార్టీ ఆధిక్యత దిశగా సాగుతుండడంతో ముఖ్యమంత్రి జయలలిత నివాసం ఉంటున్న పోయస్ గార్డెన్‌లో ఆమె అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుతున్నారు. గురువారం ఉదయం కౌంటింగ్ ప్రారంభించన కాసేపటికే తమ పార్టీ పలు స్థానాల్లో ఆధిక్యతలో ఉందని తెలుసుకుని కార్యకర్తలు స్వీట్లు పంచుకుని ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు.

05/19/2016 - 11:16

చెన్నై: అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఏయే రాష్ట్రాల్లో ఏయే పార్టీలు ఆధిక్యతలో ఉన్నాయో కౌంటింగ్ సరళి చెబుతోంది. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె మరోసారి అధికారం చేపట్టేదిశగా సాగుతోంది.

05/19/2016 - 08:04

కొలంబో, మే 18: భారీ వర్షాలు, వరదలు శ్రీలంకలో ప్రళయాన్ని సృష్టించాయి. వర్ష బీభత్సానికి కొండ చరియలు విరిగిపడి 200 మంది జలసమాధి అయ్యారు. మూడు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు లంకను అతలాకుతలం చేశాయి. 40 మంది వరకూ మృతి చెందారని అధికారులు వెల్లడించారు. శిథిలాల నుంచి 17 మృతదేహాలను వెలికితీసినట్టు తెలిపారు. మట్టిపెళ్ల కింద కూరుకుపోయి చనిపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని భయపడుతున్నారు.

05/19/2016 - 08:02

న్యూఢిల్లీ, మే 18: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరుగనున్న ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ప్రియాంకా గాంధీని రంగంలోకి దించాలనే ప్రతిపాదనను అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

Pages