S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/07/2016 - 12:49

దిల్లీ: తాను బకాయిపడిన మొత్తంలో నాలుగు వేల కోట్ల రూపాయలను త్వరలో చెల్లిస్తానన్న కింగ్‌ఫిషర్ యజమాని విజయ్‌మాల్యా ప్రతిపాదనకు బ్యాంకులు సమ్మతించలేదు. మాల్యా రుణాల ఎగవేత పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా బ్యాంకులు ఈ విషయాన్ని తెలిపాయి. వివిధ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు బకాయిపడిన మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే.

04/07/2016 - 07:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు ప్రజలకు అద్భుతమైన రీతిలో సేవలందిస్తున్నాయని, కష్టపడి పని చేస్తున్న ముఖ్యమంత్రులను చూసి పార్టీ గర్విస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

04/07/2016 - 08:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడుతూ, బంగారు ఆభరణాలపై విధించింది ఒక శాతం ఎక్సైజ్ సుంకం కాదని, అది బంగారం వ్యాపారుల పాలిట యమపాశం వంటిదని అన్నారు. అంతేకాదు బడా వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేందుకే బిజెపి ప్రభుత్వం ఈ పని చేసిందన్నారు.

04/07/2016 - 01:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: రైతులకు స్మార్ట్ పంపుసెట్లు, ఇళ్లు, దుకాణాలు సంస్థలకు స్మార్ట్ ఫ్యాన్లు వస్తున్నాయి. కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ గురువారం విజయవాడలో స్మార్ట్ పంపుసెట్లు, ఫ్యాన్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పియూష్ గోయల్ కార్యాలయం తెలిపింది.

04/07/2016 - 01:09

ముంబయి, ఏప్రిల్ 6: ఢిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని విధ్వసం సృష్టించేందుకు పాకిస్తాన్‌కు చెందిన ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు సంచరిస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు బుధవారం హెచ్చరించాయి. మారుతీ స్విఫ్ట్ జైర్ కారులో వీరు తిరుగుతున్నట్టుగా వెల్లడించాయి. వీరి వద్ద భారీ ఆయుధాలు, ఆత్మాహుతి దాడి జరిపేందుకు బెల్టులు కూడా ఉన్నట్టుగా స్పష్టం చేసింది.

04/07/2016 - 00:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: రాష్టప్రతి ప్రణబ్ ఆదేశాల మేరకు ఢిల్లీ, గుజరాత్ హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించిన అనంతరమే బదిలీలు జరిగాయ. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సురేష్ కుమార్ ఖేట్ హైదరాబాద్‌లోని జుడికేచర్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆయన సేవలందజేస్తారని రాష్టప్రతి ఆదేశంలో పేర్కొన్నారు.

04/06/2016 - 17:59

శ్రీనగర్: పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడమే కాకుండా ఇప్పటికీ వెంటాడి వేధిస్తున్నారని శ్రీనగర్ ఎన్‌ఐటిలో చదువుతున్న తెలుగు విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ పోటీ సందర్భంగా నిట్ విద్యార్థులపై స్థానికులు దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిట్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీ చార్జి చేశారు.

04/06/2016 - 16:27

దిల్లీ: జమ్ము-కాశ్మీర్ సరిహద్దుల గుండా భారత్‌లోకి ముగ్గురు ఉగ్రవాదులు ప్రవేశించినందున దిల్లీ, గోవా, ముంబయి ప్రాంతాల్లో బాంబుదాడులకు అవకాశం ఉందని పంజాబ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ ముగ్గురు ఉగ్రవాదులు మరో వ్యక్తితో కలిసి కారులు సంచరిస్తున్నట్లు వారు ఎక్కడైనా బాంబుదాడికి లేదా ఆత్మాహుతి దాడికి తెగబడే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు.

04/06/2016 - 16:25

ముంబయి: ముంబయితో పాటు మహారాష్టల్రోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరత ఉండగా ఐపిఎల్ మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్ పిచ్‌లను తడిపేందుకు భారీగా నీటిని వృథా చేయడం సరికాదని ముంబయి హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి ఎద్దడి లేని చోట మ్యాచ్‌లు నిర్వహించుకోవాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కు కోర్టు సూచించింది.

04/06/2016 - 16:23

ముంబయి: తమ కుమర్తె జీవితాన్ని నాశనం చేసిన బోయ్‌ఫ్రెండ్ రాహుల్‌ను ఉరితీయాలని లేదా జీవితాంతం జైల్లో పెట్టాలని ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి ప్రత్యూష తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యూష ఆత్మశాంతి కోసం బుధవారం ప్రార్ధనలు జరిపిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. డబ్బు కోసం ప్రత్యూషను శారీరకంగా, మానసికంగా వేధించి చివరికి ఆమె ఆత్మహత్యకు రాహుల్ కారకుడయ్యాడని వారు తెలిపారు.

Pages