S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/22/2016 - 15:14

దిల్లీ: భద్రతా వ్యవస్థను ఛేదించి పార్లమెంటులోకి వెళ్లడంపై ఓ వీడియో తీసి సామాజిక మీడియాలో పోస్టు చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపి భగవంత్ మాన్ వ్యవహారంపై శుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో కాంగ్రెస్, బిజెపి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎదుట వెంటనే హాజరు కావాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ భగవంత్ మాన్‌కు సమన్లు జారీ చేశారు. దీంతో ఆయన స్పీకర్ ఎదుట హాజరై సుమారు 20 నిమిషాలపాటు వివరణ ఇచ్చారు.

07/22/2016 - 15:10

దిల్లీ: అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో రాజ్యసభలో శుక్రవారం గందరగోళం నెలకొంది. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు. మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ఆప్‌ సభ్యుడు భగవంత్‌మాన్‌పై చర్యలు తీసుకోవాలంటూ భాజపా సభ్యులు ఛైర్మన్‌ పోడియం వద్ద నినాదాలు చేశారు.

07/22/2016 - 13:56

చెన్నై: శుక్రవారం ఉదయం తాంబరం నుంచి పోర్టుబ్లెయిర్‌కు బయలుదేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం గల్లంతయ్యింది. ఉదయం 8.12 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. 29 మంది సిబ్బందితో బయలుదేరిన ఏఎన్‌-32 విమానం ఆచూకీ తెలుసుకునేందుకు ఎయిర్‌ఫోర్స్‌తో పాటు తీర రక్షక, నౌకాదళాల బృందాలు గాలిస్తున్నాయి. విమానం బంగాళాఖాతంలో కూలిపోయిందా? దారి మళ్లిందా ?

07/22/2016 - 12:26

గాంధీనగర్: గుజరాత్‌లోని ఉనాలో దళితులపై దాడి ఘటన ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం నాడు ఉనాలో బాధిత దళితులను పరామర్శించారు. దళిత వ్యతిరేక విధానాలతో వ్యవహరిస్తున్న బిజెపి నాయకులకు త్వరలో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.

07/22/2016 - 12:25

దిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఎపికి ప్రత్యేకహోదా కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుపై ఈరోజు రాజ్యసభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నందున తమ పార్టీ ఎంపీలు సభలోనే ఉండాలని టిడిపి, బిజెపి విప్ జారీ చేశాయి. తన పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ ఇదివరకే విప్ జారీ చేసింది. ప్రైవేటుబిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు టిడిపి నేతలు ఇప్పటికే ప్రకటించగా, బిజెపి వైఖరి ఇంకా బహిర్గతం కాలేదు.

07/22/2016 - 04:45

న్యూఢిల్లీ, జూలై 21:గుజరాత్‌లో దళితులపై జరిగిన దాడి మానవత్వానికే మాయని మచ్చ అని కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్వరంతో స్పందించింది. ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని గురువారం రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానంగా చెప్పింది. ఎన్టీయే పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది.

07/22/2016 - 04:22

న్యూఢిల్లీ, జూలై 21: కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు ఏపికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ప్రైవేటు సభ్యుడి బిల్లు శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల తరువాత చర్చకు వచ్చే అవకాశం ఉంది. స్వల్పకాలిక చర్చ అనంతరం అవసరమైతే ఓటింగ్ జరుగుతుంది. ఏదైనా వివాదం మూలంగా సభలో గందరగోళం రేగితే, దాని వల్ల సభాకార్యక్రమాలు స్తంభించిపోయి సోమవారానికి వాయిదా పడినట్లయితే..

07/22/2016 - 03:17

న్యూఢిల్లీ, జూలై 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రాజధాని ప్రాంతంలో ప్రత్యేక భవన సదుపాయాన్ని ఏర్పాటు చేయనంత వరకు హైకోర్టు విభజన జరగకపోవచ్చునని కేంద్ర న్యాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపి హైకోర్టును ఆ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయవలసి ఉన్నది. ఏపి హైకోర్టును తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టపక్కల ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ఎంత మాత్రం వీలు పడదని వారు స్పష్టం చేశారు.

07/22/2016 - 02:58

న్యూఢిల్లీ, జూలై 21: యుపిఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చివుంటే బాగుండేదని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గురువారం పార్లమెంటు ఆవరణలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావుప్రతిపాదించిన ప్రైవేట్ మెంబ్ బిల్లు శుక్రవారం ఓటింగ్‌కు వస్తోందా?

07/22/2016 - 02:57

సూళ్లూరుపేట, జూలై 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రెండు ప్రయోగాలకు సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు చివరలో పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ద్వారా మూడు దేశాలకు చెందిన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనుంది. ఇది పూర్తిగా వాణిజ్య రంగ ప్రయోగం. అదే మాసంలో లేక సెప్టెంబరు రెండోవారంలో జిఎస్‌ఎల్‌వి- ఎఫ్ 05 రాకెట్ ప్రయోగం జరిపేందుకు శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

Pages