S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/23/2016 - 02:57

లక్నో, జూలై 22: బిఎస్పీ అధినేత్రి మాయావతిపై ఉత్తరప్రదేశ్ బిజెపి నేత దయాశంకర్ సింగ్ అసభ్య వ్యాఖ్యల వివాదం శుక్రవారం కొత్త మలుపు తిరిగింది. తన భర్త ప్రాణాలు తీసేంతవరకు నిద్ర పోరని ఆరోపిస్తూ మాయావతిపైన, ఆమె పార్టీకి చెందిన నాయకులపైన దయాశంకర్ భార్య నగరంలోని హజరత్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

07/23/2016 - 02:56

న్యూఢిల్లీ, జూలై 22: పార్లమెంటు భద్రతపై వీడియో తీయడమే కాకుండా దాన్ని సోషల్ మీడియాలో పెట్టినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి భగవంత్ మాన్ శుక్రవారం బేషరతు క్షమాపణ చెప్పారు. తెలియకుండా తప్పు చేశానని, ఇది ఇంత పెద్ద విషయం అవుతుందని తాను అనుకోలేదని మాన్ చెప్పారు.

07/23/2016 - 02:55

న్యూఢిల్లీ, జూలై 22: ముంబయిలోని వివాదాస్పద ఆదర్శ్ అపార్ట్‌మెంట్స్‌ను కూల్చివేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. 31 అంతస్తుల అపార్ట్‌మెంట్స్‌ను పడగొట్టాలంటూ బాంబే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును పలువురు యజమానులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

07/23/2016 - 02:52

ఐక్యరాజ్య సమితి, జూలై 22: నిలకడయిన అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి)ను సాధించడంలో భారత్ బాగా వెనుకబడి పోయింది. నిలకడయిన అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి 149 దేశాలకు చెందిన గణాంకాలను సేకరించి, వాటి ఆధారంగా ర్యాంకులు ఇవ్వగా, భారత్ 110వ స్థానంలో నిలిచింది. ఈ తాజా సూచీలో స్వీడన్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఎస్‌డిజిలను సాధించడంలో అన్ని దేశాలు పెద్ద సవాళ్లనే ఎదుర్కొంటున్నాయని ఈ సూచీ వెల్లడించింది.

07/23/2016 - 02:11

న్యూఢిల్లీ,జూలై 22: ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ సభ్యుడు భగవంత్ సింగ్ మాన్ నిర్వాకం మూలంగా శుక్రవారం ఓటింగ్‌కు ఏపీ ప్రత్యేక హోదాకు ప్రైవేట్ మెంబర్ బిల్లు రెండు వారాల తరువాత మరోసారి రాజ్యసభ ముందుకు వస్తుంది. కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు ప్రతిపాదించిన ఈ బిల్లుపై రెండు వారాల తరువాత కూడా ఓటింగ్ జరుగుతుందా? అనేది అనుమానమే.

07/23/2016 - 02:10

న్యూఢిల్లీ, జూలై 22: ఆం ఆద్మీ పార్టీ సభ్యుడు భగవంత్ మాన్ చేసిన నిర్వాకం మూలంగా శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలు ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు భద్రతకు ముప్పు తెచ్చిన భగవంత్ మాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికార పక్షంతోపాటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఉభయసభలను స్తంభింపజేశాయి.

07/23/2016 - 02:07

న్యూఢిల్లీ, జూలై 22: గత ఏడాది జూన్‌లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగో నిందితుడు జెరూసలెం మత్తయ్యకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు మత్తయ్యపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.

07/23/2016 - 02:05

కొచ్చి, జూలై 22: అతనో ఆగర్భ శ్రీమంతుడు. దేనికీ లోటు లేదు. ఒకరకంగా చెప్పాలంటే అతని జీవితం వడ్డించిన విస్తరి. కానీ అతని తండ్రి భిన్నంగా ఆలోచించాడు. జీవిత సత్యాల్నీ, పేదరికంలోని కష్టాల్నీ, ఉద్యోగం కోసం యువత పడుతున్న ఇబ్బందుల్ని అనుభవ పూర్వకంగా తెలియజేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అతనికి కొన్ని నిబంధనలు పెట్టి ఏకంగా వనవాసమే పంపించాడు. ‘నెల రోజులపాటు నీ సంపాదన నీవే సంపాదించుకోవాలి...

07/23/2016 - 02:03

న్యూఢిల్లీ, జూలై 22: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయినా ప్రజల సమస్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటం చేస్తున్నారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం సాయంత్రం రాహుల్ గాంధీ తన నివాసంలో ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు.

07/23/2016 - 02:01

న్యూఢిల్లీ,జూలై 22: ఎన్‌డిఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచందర్‌రావుప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరగకుండా అడ్డుకుంది. బిజెపి, అకాలీదళ్ సభ్యులు శుక్రవారం చేసిన గొడవ మూలంగా ప్రత్యేక హోదా బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరగలేదు.

Pages