S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/02/2016 - 21:41

ప్రముఖ నటుడు నాగార్జున హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ చిత్రం శనివారంనాడు షూటింగ్ ప్రారంభమైంది. హాథిరామ్ గెటప్‌లో నాగార్జునపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తపు షాట్ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు నాగార్జున.

07/02/2016 - 21:39

అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా రూపొందిన దేవదాసు చిత్రంలో ‘పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో’ అనేది ఎవర్‌గ్రీన్ సాంగ్. ఈపాట ఇప్పుడు రీమిక్స్‌గా ‘ఆటాడుకుందాం రా’ చిత్రంలో వినిపించబోతోంది.

07/02/2016 - 21:38

దక్షిణాదిలో చాలాకాలం పాటు క్రేజీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గోవా బ్యూటీ ఇలియానాకు బాలీవుడ్‌పై హీరోయిన్‌గా వెలగాలనే ఆశ కలిగింది. దాంతో ఇక్కడ అవకాశాలను కాదనుకుని బాలీవుడ్‌కు చెక్కేసింది. బాలీవుడ్‌లో వచ్చిన రెండు మూడు సినిమాలు ఈమె కెరీర్‌కు పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతోపాటు చేతిలో పెద్దగా అవకాశాలు లేవు.

07/02/2016 - 21:37

హాలీవుడ్‌లో అద్భుత చిత్రాల సృష్టికర్త స్టీవెన్స్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వస్తున్న మరో అద్భుత చిత్రం ‘ది బిగ్ ఫ్రెండ్లీ జెయింట్’ (ది బి ఎఫ్ జి). డిస్నీ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ఈనెల 15న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రకు నటుడు జగపతిబాబు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పడం జగపతిబాబుకు ఇదే తొలిసారి.

07/02/2016 - 21:36

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వై.రాజీవ్‌రెడ్డి, జి.సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ.. ‘ఈనెల 4నుండి ఈ చిత్రం మూడో షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది.

07/02/2016 - 21:35

‘రచ్చ’ సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సంపత్‌నంది ఆ తర్వాత పవన్‌కళ్యాణ్ నటించిన ‘గబ్బర్‌సింగ్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందే ‘గబ్బర్‌సింగ్-2’కోసం పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. చాలాకాలం సినిమాకోసం వెయిట్ చేసిన సంపత్‌నంది ఆ సినిమా కాదనుకుని రవితేజతో ‘బెంగాల్ టైగర్’ చిత్రా న్ని తెరకెక్కించాడు.

07/02/2016 - 21:34

ఫిలిమ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి కోశాధికారిగా నిర్మాత జె.బాలరాజు ఎంపికయ్యారు. అధ్యక్షులు జి.ఆదిశేషగిరిరావు, ఉప కార్యదర్శి కె.సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు విజయ్‌చందర్‌లు బాలరాజును కోశాధికారిగా ఎంపిక చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలు నిర్మించిన బాలరాజు ఎన్.టి.ఆర్, ముని మనవడుతో దాన వీర శూర కర్ణ చిత్రాన్ని నిర్మించారు.

07/02/2016 - 21:31

‘బిచ్చగాడు’ చిత్రం ఇంత గొప్ప విజయం సాధించడాన్ని నమ్మలేకపోతున్నానని, ఈ సినిమా ఇంత గొప్పగా విజయవంతం కావడానికి ఆరుగురు కారణమని హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని తెలిపారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్తనా టైటస్ జంటగా ఫాతిమా ఆంటోని రూపొందించిన చిత్రం ‘బిచ్చగాడు’. ఈ చిత్రాన్ని తెలుగులో చదలవాడ తిరుపతిరావు తెలుగులో అందించారు.

07/02/2016 - 21:21

నూతన తారలతో అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘అత్తారిల్లు’. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో అంజన్ కె.కళ్యాణ్ రూపొందించారు. సినిమాకు సంబంధించిన పాటల సీడీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు.

,
07/01/2016 - 21:22

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సింగళి భాషలలో వేల పాటలను ఆలపించిన ఎస్.జానకికి సైమా అవార్డుల ప్రదానోత్సవంలో జీవితకాల పురస్కారాన్ని అందించారు. గత ఏడాది విడుదలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా రంగాలకు సంబంధించిన చిత్రాలకు ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం అందించే సైమా అవార్డుల వేడుక ఈసారి సింగపూర్‌లో నిర్వహించారు.

Pages