S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 20:48

విభిన్న కథా చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్, ప్రస్తుతం ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తరువాత ఆయన నటించే నూతన చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.

08/05/2016 - 20:46

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’ చిత్రం అంతే భారీ వసూళ్లను దక్కించుకుంది. రాజవౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషలతోపాటు విదేశీ భాషల్లో కూడా విడుదలై సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బాహుబలి-2’ రూపొందుతోంది. ది కన్‌క్లూజన్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారట.

08/05/2016 - 20:44

తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా కెరీర్‌కు కనీసం ఒక్క బ్రేక్ అయినా రాలేదు. అవకాశాలు మాత్రం వచ్చాయి కానీ, అనుకున్న క్రేజ్ దక్కలేదు. దాంతో అందాల ఆరబోతలో శ్రుతిమించిన శ్రద్ధాదాస్ ఆ తరువాత బాలీవుడ్‌లోకి అడుగులేసింది. అక్కడ అడల్డ్ కంటెంట్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ ఈమెకు మంచి గుర్తింపే వచ్చింది.

08/05/2016 - 20:42

మలయాళ భామ కేథరీన్ ఈమధ్య తమిళంతోపాటు తెలుగులోనూ జోరుమీదుంది. లేటెస్టుగా సరైనోడు సక్సెస్‌తో ఫామ్‌లోకి వచ్చిన ఈమె, ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ సరసన నటించేందుకు రెడీ అయ్యింది. ఇదివరకే బన్నీ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో నటించింది. సరైనోడు తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.

08/05/2016 - 20:40

సుమన్‌శెట్టి, చిత్రం శ్రీను, చిట్టిబాబు, శిల్ప, మేఘనారాయ్ ముఖ్యపాత్రల్లో విఎకె భాస్కర్ దర్శకత్వంలో దేవికృష్ణ సినిమా పతాకంపై షాబోలి రమాగౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘నువ్వు ఎవరో నేను ఎవరో’.

08/04/2016 - 21:07

మంచు లక్ష్మి ముఖ్య పాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న లక్ష్మి బాంబ్ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

08/04/2016 - 21:04

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ పాటలు ఈనెల 12న విడుదల కానున్నాయి. చిత్రాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేస్తారు. కాగా గురువారం నాడు ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ కొత్త స్టిల్ విడుదల చేశారు.

08/04/2016 - 21:03

పరుచూరి గోపాలకృష్ణ, సురేష్, ఖయ్యూం ముఖ్యపాత్రల్లో వెంకటేశ్వర శర్మ అక్కపెద్ది దర్శకత్వంలో షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై తాడి మనోహర్‌కుమార్ నిర్మిస్తున్న ‘డర్టీగేమ్’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, నటుడు సురేష్‌తో కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా వుంది. రాజకీయ నేపథ్యంలో నడిచే సినిమా ఇది.

,
08/04/2016 - 21:01

పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువే?. ఈ విషయం తెలుగు సినిమా రంగానికీ వర్తిస్తుంది. తెలుగు తెరపై మెరిసిన కథానాయికల విషయంలో చూస్తే తెలుగు అమ్మాయిల అందం కంటే పొరుగు అమ్మాయిల అందానికే దాసోహం అయ్యారు తెలుగు ప్రేక్షకులు, తెలుగు సినిమా నిర్మాతలు. పక్క రాష్ట్రాలనుండి కథానాయికలను దిగుమతి చేసుకోవడం సాధారణమైపోయింది. ఇది ఇతర సినీరంగాల్లోనూ సాధారణమైపోయింది. తెలుగు అమ్మాయిలు..

08/04/2016 - 20:45

సునీల్, మన్నారా చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్‌పిఎ క్రియేషన్స్ పతాకంపై ఆర్.సుదర్శన్‌రెడ్డి నిర్మించిన జక్కన్న చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ముఖ్యంగా భారీ ఓపెనింగ్స్ వసూళ్లు రాబట్టుకుంటున్న సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, దర్శకుడిగా ఇది తనకు రెండవ చిత్రం.

Pages