S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 21:05

ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్‌కాపీ పిక్చర్స్ పతాకాలపై సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మన వూరి రామాయణం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, వచ్చేనెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

09/25/2016 - 21:03

కాటమరాయుడంటే మాటలా? కోపం వస్తే ఎవరికైనా కాటు తప్పన్నట్లుగా సాగుతోంది కాటమరాయుడు సినిమా పరిస్థితి. తాజాగా ఈ సినిమా యూనిట్ నుండి మరొకరికి కాటమరాయుడు దెబ్బపడిందని టాలీవుడ్ భోగట్టా. తొలుత ఈ చిత్రానికి దర్శకుడు ఎస్.జె.సూర్యను అనుకున్నారు. అనుకోకుండా తమిళంలో వచ్చిన భారీ ఆఫర్లతో ఆయన పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత కిషోర్ పార్థసాని (డాలీ) రంగంపైకి వచ్చారు.

09/25/2016 - 21:02

తరుణ్, ఓవియా జంటగా రామ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రమేష్ గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరీ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలుపుతూ లడక్, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని, మూడు పాత్రలలో తరుణ్ నటన ఈ చిత్రానికి ప్రాణంగా నిలుస్తుందని అన్నారు.

09/25/2016 - 21:00

సునీల్, సుష్మారాజ్, రీచాపనయ్ ప్రధాన తారాగణంగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వీరు పోట్ల దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర రూపొందిస్తున్న చిత్రం ‘ఈడు గోల్డ్‌ఎహే’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని, వచ్చేనెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలైంది.

09/25/2016 - 20:59

అమెరికాలో విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘క్వాంటికొ’ 2 సీజన్ ప్రచార కార్యక్రమంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బిజీగా ఉంది. ఈ సీరియల్‌లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది తొలి సిరీస్‌లో నటించి మెప్పించిన ప్రియాంక రెండో సీజన్‌లోనూ నటించింది. ప్రస్తుతం అమెరికాలో తోటి నటుడు బ్లెయిర్ అండర్‌వుడ్‌తో కలసి విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

09/25/2016 - 20:56

వెంకటేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, ప్రాచీ అధికారి, కులకర్ణి మమత ప్రధాన తారాగణంగా శివపార్వతి క్రియేషన్స్ పతాకంపై రమేష్ అంకం దర్శకత్వంలో చెట్టిపల్లి వెంకటేష్ గౌడ్, బిరాధర్ మల్లేష్ యాదవ్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం సుడిగాలి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..

09/25/2016 - 20:54

సుబ్బు కథానాయకుడిగా అభి సుబ్రహ్మణ్యం క్రియేషన్స్ పతాకంపై శ్రీకృష్ణ గొర్లె దర్శకత్వంలో శివపురం సురేంద్రకుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘రజని ద డాన్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఏ సంబంధం లేని హీరోకి అనుకోకుండా ఓ బంధం ఏర్పడితే అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది.

09/25/2016 - 20:53

గురుసాయిబాబా ఇంటర్నేషనల్ పతాకంపై మిలింద్ గునాజీ సాయిబాబాగా నటించిన చిత్రం ‘బ్రహ్మాండ నాయక్ సాయిబాబా’. సత్యప్రకాష్ దూబె దర్శకత్వంలో నార్సింగ్ ఎం.షిండే, సత్యప్రకాష్ దూబె తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు.

09/25/2016 - 01:19

మిస్టర్ కూల్ అని అందరిచేత ముద్దుగా పిలిపించేకునే టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని హైదరాబాద్‌లో హంగామా చేశారు. ఆయన జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘ఎంఎస్ ధోని’ (ద అన్‌టోల్డ్ స్టోరీ). చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధోని రావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

09/25/2016 - 01:18

14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా రామ్ ఆచంట, గో పీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూ పొందించిన ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంగీతాన్ని జీబ్రాన్ అందించారు. సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుకుమార్, హరీష్ శంకర్, నాని థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Pages