S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/27/2016 - 20:57

యంగ్ హీరో నాగచైతన్య తాజా చిత్రం ‘ప్రేమమ్’ మంచి విజయం సాధించడంతో ఆయన ప్రాజెక్టులపై నిర్మాతల్లోనూ, డిస్ట్రిబ్యూటర్లలోనూ నమ్మకం బాగా పెరిగింది. ‘ప్రేమమ్’లో చైతూ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా మెప్పించడంతో ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టులకే కాకుండా షూటింగ్ పూర్తయి రిలీజ్‌కు రెడీగా వున్న సినిమాలకు కూడా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆయన చేసిన సినిమాల్లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం రిలీజ్‌కి రెడీగా వుంది.

10/27/2016 - 20:55

బాలకృష్ణ కథానాయకుడిగా ఫస్ట్ ఫ్రేమ్స్ పతాకంపై జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. బాలకృష్ణ వందో చత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ భారీఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోందని, అది చూస్తుంటే సినిమాకోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారని అర్థమవుతుందన్నారు.

10/27/2016 - 20:54

ప్రియాంక కీలక పాత్రలో కె.ఆర్.కె. ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ పతాకంపై లోహిత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘చిన్నారి’. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించారు. బేబి యులినా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం గూర్చి నిర్మాతలు మాట్లాడుతూ, హారర్ జోనర్‌లో చైల్డ్ సెంటిమెంట్ ప్రాధాన్యతతో రూపొందించిన ఈ చిత్రం గోవా నేపథ్యంలో సాగుతుందని తెలిపారు.

10/27/2016 - 20:53

పవన్‌కళ్యాణ్‌తో ‘గబ్బర్‌సింగ్’ సినిమా చేసి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్ ఆ తరువాత ఎన్టీఆర్‌తో తీసిన ‘రామయ్య వస్తావయ్యా’ భారీ పరాజయాన్ని పొందడంతో కాస్త గ్యాప్ వచ్చింది. ఆ తరువాత వచ్చిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాతో హిట్ అందుకున్న ఈ దర్శకుడు మళ్లీ మెగా హీరోలతోనే సినిమాలు చేయాలనీ ఫిక్స్ అయినట్టుంది.

10/27/2016 - 20:51

సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలపు శ్రీనివాస్, ఠాగూర్ మధు రూపొందిస్తున్న చిత్రం ‘విన్నర్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మహాశివరాత్రి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

10/27/2016 - 20:49

ఈ ఏడాదిలో విడుదలైన ‘పెళ్లిచూపులు’ సినిమా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం కోటిన్నర లోపే బడ్జెట్‌లో కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకుపైగా వసూళ్లు సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

10/27/2016 - 20:47

శుకా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీకాంత్ చల్లా దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘వశం’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటను తమ్మారెడ్డి భరద్వాజ, ట్రైలర్‌ను రాజ్ కందుకూరి విడుదల చేశారు.

10/27/2016 - 20:45

సోనారిక ప్రధానపాత్రలో లక్ష్మీ టాకీస్ సమర్పణలో సూర్యదేవ్ ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై రాజీవ్ దర్శకత్వంలో గుడి వంశీధర్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘కాళరాత్రి’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

10/27/2016 - 20:44

బుల్లితెరకి కొత్త అందాన్ని తీసుకొచ్చిన ముద్దుగుమ్మ అనసూయ. మొట్టమొదట ఆమెకి పవన్‌కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’లో ఐటెమ్ పాట చేసే అవకాశమొచ్చింది. కానీ అప్పట్లో నో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పాట ఎందుకు చేయలేదో కూడా ఆ తర్వాత కారణాలు చెప్పింది. ఆయితే తర్వాత్తర్వాత కూడా ఐటెమ్ పాటల కోసం ఆమెని పలు ఆఫర్లు వరించాయి. కానీ వాటిని ఒప్పుకోకుండా క్షణం, సోగ్గాడే చిన్నినాయన చిత్రాల్లో నటించింది.

10/26/2016 - 22:12

హిట్టు వెంట హిట్ కొట్టేశాడు చందు మొండేటి. ‘కార్తికేయ’ వంటి ప్రయోగాత్మక చిత్రంతో తొలి విజయం అందుకున్నాడు. ఆ వెంటనే అక్కినేని కాంపౌండ్‌లో వచ్చి పడ్డాడు. నాగచైతన్య హీరోగా ‘ప్రేమమ్’ రీమేక్ తెరకెక్కించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇదే ఊపులో వున్న చందు మొత్తం 12 కథలు సిద్ధం చేసుకున్నాడట. ఒక్కొక్కటి ఏ హీరోకి సూటైతే ఆ హీరోకి చెబుతున్నాడట. ఇప్పటికే నాగార్జున, అఖిల్‌లో క్యూలో వున్నారు.

Pages