S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/30/2016 - 21:55

సమాజంలో అనారోగ్య, ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్న కుటుంబాలని ప్రత్యేక శ్రద్ధతో గుర్తించి వారిని ఆదుకోవడానికి తమ వంతు బాధ్యతగా ‘మేము సైతం’ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, వెండితెరమీద మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా మన స్టార్స్ తమ ప్రత్యేకతను చాటబోతున్నారని మంచు లక్ష్మి వెల్లడించారు.

03/30/2016 - 22:31

అందాల భామ శ్రుతిహాసన్ నటిగా పేరు తెచ్చుకుంటూ ముందుకు వెళుతున్నారు. మలయాళం ‘ప్రేమమ్’ సినిమాలో సాయి పల్లవి పోషించిన మలర్ పాత్రకు తనని ఎంపిక చేసినపుడు అందరూ పెదవి విరిచారు. కానీ ఇటీవల ‘ప్రేమమ్’ ఫస్ట్‌లుక్‌లో ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. లెక్చరర్ పాత్రలో తనని తాను మలుచుకున్న విధానానికి అందరూ ఫిదా అయ్యారు. ఇది ఎలా సాధ్యపడిందన్న ప్రశ్నకు శ్రుతిహాసన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

03/30/2016 - 21:42

కింగ్ నాగార్జున, ఆవారా కార్తి, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అనే్న నిర్మించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఊపిరి’. తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల విడుదలైన ఈ చిత్రం సెనే్సషన్ క్రియేట్ చేస్తోందని అంటున్నారు నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి.

03/29/2016 - 21:53

ఖర్గపూర్‌లో ప్రస్థానం టెక్నాలజీ డ్రమెటిక్ సొసైటీ ఆధ్వర్యంలో నటుడు, రచయిత, దర్శకుడు
తనికెళ్ల భరణిని సన్మానించారు. అక్కడి తెలుగు విద్యార్థులు అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు.

03/29/2016 - 21:41

ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరబ్‌జిత్’ చిత్రంలోని ఓ పాటలో పంజాబీ సంప్రదాయ దుస్తులు, అలంకరణతో మెరిసిపోయింది అందాలతార ఐశ్వర్యారాయ్. చేతినిండా గాజులు, ఎర్రని పంజాబీ సంప్రదాయ దుస్తులు, కంటి కాటుక పెట్టుకుంటూ ఓ పాటలో కన్పించే ఐశ్వర్యరాయ్ ఫొటోను ఆ చిత్రం యూనిట్‌ను సోషల్‌మీడియాలో విడుదల చేశారు. ఈ ఫొటోలో కొత్తగా కన్పించిన ఐశ్వర్య మరోసారి తన అభిమానుల మనసు చూరగొంది.

03/29/2016 - 21:39

తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 25న విడుదలైన ‘ఊపిరి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. రీసెంట్‌గా సినిమాను చూసిన దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ‘ఊపిరి’ సినిమా గురించి మాట్లాడుతూ ఊపిరి సినిమా చూశాను, చాలా బావుంది. నా మనసుకు ఎంతో నచ్చింది. తెలుగు సినిమా కొత్తతరహా సినిమాలు తీస్తున్నామని చెప్పడానికి ఊపిరి పోసింది. ‘బొమ్మరిల్లు’ తర్వాత నాకు సంపూర్ణంగా నచ్చిన సినిమా లేదు.

03/30/2016 - 05:03

హైదరాబాద్: ‘గానకోకిల’గా తెలుగువారందరికీ తెలిసిన నేపధ్యగాయని సుశీల తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆరు భాషల్లో 17,695 పాటలు పాడిన గాయనిగా ఆమెకు ఈ అరుదైన ఘనత దక్కింది. 1950లో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె తెలుగుతో పాటు తమిళం, మళయాలం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, తుళు భాషల్లో పాడి సంగీతానికి ఎలాంటి సరిహద్దులు లేవని నిరూపించారు.

03/29/2016 - 21:32

‘విక్రమసింహ’, ‘లింగ’ లాంటి రెండు వరుస పరాజయాల తర్వాత రజనీకాంత్, తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ‘కబాలి’, ‘రోబో 2.0’ సినిమాలను సిద్ధం చేస్తున్నారు.

03/29/2016 - 21:27

అభిరుచిగల నిర్మాతగా ‘మనవూరి పాండవులు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘సీతారాములు’, ‘కృష్ణార్జునులు’, ‘వివాహ భోజనంబు’ వంటి చిత్రాలను రూపొందించిన మేకప్‌మెన్, నిర్మాత జయకృష్ణ మంగళవారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. మేకప్‌మన్ అప్రెంటిస్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన నిర్మాతగా ఎదిగి ఉత్తమమైన చిత్రాలను రూపొందించారు.

03/29/2016 - 21:25

క్రాంతిమాధవ్ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్‌తో సునీల్ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు వి.వి.వినాయక్ తెలిపారు. సునీల్, మియా జంటగా యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ పతాకంపై క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పరుచూరి కిరీటి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, డి.సురేష్‌బాబు క్లాప్‌కొట్టారు.

Pages