S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/27/2015 - 21:31

సాయిరంగా ఫిలింస్ పతాకంపై ఎస్.డి.రమేశ్ సెల్వన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘వజ్రం’ చిత్రాన్ని తెలుగులో ‘ఓదార్పుయాత్ర’గా అందిస్తున్నారు. శ్రీరామ్, కిశోర్, పాండి, కుట్టిమణి ప్రధాన తారాగణంగా రూపొందించిన ఈ చిత్రానికి నిర్మాత కె.రంగారావు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

11/27/2015 - 21:27

శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై నందినిరెడ్డి దర్శకత్వంలో దామూ రూపొందిస్తున్న చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

11/27/2015 - 21:26

అంతర్జాతీయ ఫిల్మోత్సవాలలో భాగంగా పారిస్‌లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో నిర్వహిస్తున్నట్టుగా ఫ్రెంచ్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ గ్రాబిలో బెనె్నన్ తెలిపారు. గోవాలో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ పాత్రికేయుల సమావేశంలో పారిస్‌లో భారతీయ సినిమా అంశంపై ఆమె మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని, గొప్పతనాన్ని పారిస్ ప్రజలకు పరిచయం చేయడానికి ఈ ఫిల్మోత్సవ్ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

11/25/2015 - 21:11

వరుస విజయాలతో తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ రేసులో నిలిచింది అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్. గోపీచంద్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటిస్తున్న ఈ భామకు తన సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని తెగ ఆశపడుతోంది. ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో నటిస్తోన్న రకుల్ ఈ సినిమాలో సొంత డబ్బింగ్ చెబుతోందని అంటున్నారు. దీనికోసం ఆమె తెలుగుకూడా బాగానే నేర్చుకుంటోంది.

11/25/2015 - 21:09

అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ తన మొదటి సినిమా ‘అఖిల్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో తన తదుపరి సినిమాపై చాలా శ్రద్ధ తీసుకునే పనిలో పడ్డాడు అఖిల్. మరోవైపు నాగార్జున కూడా అఖిల్‌ను సరైన దారిలో తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రస్తుతం అఖిల్‌తో సినిమా చేసేందుకు దర్శకుడు క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడట.

11/25/2015 - 21:05

దక్షిణాదిలో సంచలన హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం తమిళంలో బిజీగా వుంది. వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న నయనతారకు ఇటీవలే విడుదలైన ‘మయూరి’ చిత్రం మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. అయితే ఎన్ని చిత్రాల్లో చేసినా కూడా నయనతారకు విక్రమ్ సరసన నటించాలనే కల ఉండేదట. ఆయనతో ఎప్పటికైనా నటిస్తానని అంటోంది ఆమె.

11/25/2015 - 20:47

ఈమధ్యే గోపీచంద్ హీరోగా వచ్చిన ‘జిల్’ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్‌గా పెద్దగా వర్కవుట్ కాకపోయినప్పటికీ ఈ సినిమాలో గోపీచంద్ చాలా కొత్తగా కన్పించాడని అన్నారు. ప్రస్తుతం ఆయన ‘సౌఖ్యం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

11/25/2015 - 20:41

‘బాహుబలి’ భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం దాదాపు 500 కోట్ల భారీ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందే ‘బాహుబలి-2’ కోసం ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి.

11/25/2015 - 20:39

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో పాపులరైన అవికాగోర్ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తరువాత హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుని వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా అవికాగోర్, సంతోష్ జంటగా పి.రామ్మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తను నేను’. ఈ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా అవికాగోర్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లో...

11/25/2015 - 20:37

వెంకటేష్, మారుతి కాంబినేషన్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం వచ్చేనెల ప్రారంభం కానుంది. నయనతార కథానాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ తమ రెండవ చిత్రంగా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. డిసెంబర్ 16న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు.

Pages