S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/20/2018 - 03:44

రామగిరి, మార్చి 19: సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌ను, నల్లగొండ ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌ను విమర్శిస్తూ దుష్ప్రచారం చేసిన హైద్రాబాద్ వాసి అనంచిన్న వెంకటేశ్వర్‌రావును అరెస్టు చేసి సోమవారం కోర్టుకు రిమాండ్ చేసినట్టు నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ మధు తెలిపారు.

03/20/2018 - 03:21

సైదాపూర్, మార్చి 19: మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన తాడవేని నాగరాజు (24) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైదాపూర్ ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్ తెలిపిన వివరాల ప్రకారం..నాగరాజుకు తల్లి అనారోగ్యంతో ఉండగా, తండ్రి ఏమీ పని చేయకపోగా కుటుంబ భారం మృతుడు నాగరాజుపై పడింది.

03/20/2018 - 02:39

హైదరాబాద్, మార్చి 19: వెంగళరావునగరంలోని రాష్ట్ర శిశువిహార్‌లో ఆరునెలల చిన్నారి ఆదివారం రాత్రి మృతిచెందింది. శిశువిహార్ సిబ్బంది నిర్లక్ష్యమే ఇం దుకు కారణమని బాలల హక్కుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... గత ఆరు నెలల క్రితం నగరంలోని ఓ ప్రాంతలో చిన్నారిని గమనించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి చిన్నారిని తీసుకువచ్చి శిశువిహార్‌లో చేర్చారు.

03/20/2018 - 01:53

రాంచీ: అవినీతి కేసులో జైలు ఊచలు లెక్కిస్తున్న ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నాలుగో దాణా కేసులోనూ దోషిగా తేలారు. 1990లో డుమ్కా ట్రెజరీ నుంచి 3.13 కోట్ల రూపాయల అక్రమంగా విత్‌డ్రాచేసిన కేసులో లాలూను సీబీఐ ప్రత్యేక కోర్డు దోషిగా తీర్పునిచ్చింది. మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

03/20/2018 - 01:33

తలమడుగు,మార్చి 19: పంట దిగుబడులు రాక, చేసిన అప్పులు తీర్చే స్థోమత లేక జీవితంపై ఆశలుతెంచుకొని సోమవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఇద్దరు రైతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే కజ్జర్ల గ్రామానికి చెందిన కొల్లేటివార్ విజయ్ (65) తనకున్న మూడెకరాల పంట చేనులో పత్తిపంట వేయగా పంట తెగుళ్ళు సోకి ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు.

03/20/2018 - 00:57

మార్కాపురం, మార్చి 19: దుర్వ్యసనాలకు బానిసై భార్యపై అనుమానంతో భర్త హత్య చేసిన సంఘటన ఈనెల 3వ తేదీన మార్కాపురం పట్టణ పోలీసుస్టేషన్‌లో చోటుచేసుకోగా, ఆ కేసులో నిందితుడైన పారుమంచాల చిన్నక్రిష్ణయ్యను సోమవారం మార్కాపురం సిఐ భీమానాయక్ ఆధ్వర్యంలో అరెస్టుచేశారు.

03/20/2018 - 00:51

హైదరాబాద్, మార్చి 19: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాల రద్దు వివాదంపై ఆరువారాల వరకూ తదుపరి చర్యలపై ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయరాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర రావు సోమవారం నాడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు.

03/20/2018 - 00:09

న్యూఢిల్లీ, మార్చి 19: ఆదాయపు పన్ను కేసులో, రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఆదేశించింది. ఈ కంపెనీపై మొత్తం రూ.249.15కోట్ల ఆదాయపు పన్ను బకాయిలపై విచారణ జరుగుతోంది. ఈ సంస్థలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియాగాంధీలు వాటాదార్లు. ఈ మొత్తంలో సగం మార్చి 31 లోగా, మిగిలినది ఏప్రిల్ 15లోగా చెల్లించాలని జస్టిస్ ఎ. రవీంద్ర భట్, జస్టిస్ ఎ.కె.

03/19/2018 - 23:34

శ్రీశైలం ప్రాజెక్టు, మార్చి 19: ఉగాది సందర్భంగా కర్ణాటక నుండి శ్రీశైలం వచ్చిన భక్తులు స్నానానికి పాతళగంగలో దిగగా ప్రమాదవశాత్తు శనివారం మునిపోయాడు. ఈగలపెంట ఎస్‌ఐ భద్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక నుండి శ్రీశైలం వచ్చిన వెంకప్ప (28) అనేవ్యక్తి శనివారం స్నానం చేయడానికి తన సహచరులతోపాటు పాతాళగంగలో స్నానానికి దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.

03/19/2018 - 23:26

అనంతపురం, మార్చి 19: జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ కార్వర్టర్స్ ఆవరణలో ఉన్న ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ గార్డ్ విభాగంలో ఈ నెల 17న అనూహ్యంగా మాయమైన 15 బుల్లెట్లు ఎట్టకేలకు లభ్యమయ్యాయి. సోమవారం వీటిని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలోని ఓ డస్ట్‌బిన్‌లో గుర్తించారు. ఏఆర్ కార్యాలయంలో స్వీపర్‌గా పని చేస్తున్న పెన్నోబిలేసు అనే హోంగార్డు నిర్వాకం వల్లే బుల్లెట్లు మాయమైనట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది.

Pages