S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/27/2018 - 22:31

గుత్తి, మే 27 : ప్రముఖ చారిత్రాత్మక కట్టడం గుత్తి కోటలో 20 సంవత్సరాల గుర్తు తెలియని యువకుడు దారణహత్యకు గురైన ఘటన ఆదివారం సంచలనం రేపింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికులు కొందరు గుత్తికోటను సందర్శించేందుకు కొండపైకి వెళ్లారు.

05/27/2018 - 02:54

బిజినేపల్లి, మే 26: మండలంలోని నందీ వడ్డేమాన్ బీమ సముద్రం చెరువులో శనివారం ఉదయం ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతి చెందిన విషాధకరమైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యాదయ్య కుమారుడు ధర్మతేజ(10), హన్మంత్‌రెడ్డి కుమారుడు ప్రవీత్‌రెడ్డి(10), మరో బాలుడు కిరణ్ కలిసి బీమా సముద్రం చెరువుకు ఈతకు వెళ్లారు.

05/27/2018 - 02:51

మల్దకల్, మే 26: జిల్లా వ్యాప్తంగా నకిలి విత్తనాల అమ్మకాలు జోరుగా కొనసాగుతుంది. పత్తిపంటల నష్టం నుంచి రైతులు నష్టపోకుండా, ఆత్మహత్యలు నివారించడానికి ప్రభుత్వం జిల్లా ఏఎస్పీ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందం పలు చోట్ల నకిలి విత్తనాలను పట్టుకోవడం, నిందుతులపై కేసులు నమోదు చేయడం జరుగుతున్న నకిలి విత్తనాల అమ్మకాలు యదేచ్చగా వ్యాపారాలు కొనసాగుతున్నాయి.

05/27/2018 - 02:43

నిజామాబాద్, మే 26: మలివిడత తెలంగాణ ఉద్యమం సమయంలో పలువురు ఉద్యమకారులపై నమోదైన క్రిమినల్ కేసును శనివారం నిజామాబాద్ ప్రత్యేక ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రామలింగం కొట్టివేస్తూ తీర్పును వెలువరించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతున్న 2010వ సంవత్సరంలో అప్పటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ తెలంగాణ కోరుతూ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.

05/27/2018 - 02:39

కట్టంగూర్, మే 26: హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై మండలపరిధిలోని అయిటిపాముల గ్రామశివారులోని ఎన్టీ ఆర్‌నగర్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

05/27/2018 - 02:09

తాండూరు, మే 26: తాండూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని బషిరాబాద్ మండల కేంద్రం జయంతి కాలనీలో నివాసం ఉంటున్న అంగన్ వాడీ కార్యకర్త మొగులమ్మ రెండవ కూతురు నిషిత (18)లు శనివారం సరదగా ఈతకు వెళ్లీ మృత్యువాత పడింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మృతురాలు కుటుంబీకులు, బషిరాబాద్ పోలీసుల సమాచారం మేరకు ఇలా ఉన్నాయి...

05/27/2018 - 02:02

హైదరాబాద్, మే 26: నగరంలోని తిరుమలగిరి ప్రాంతంలో వృద్దురాలి హత్య కేసు మిస్టరీని టాస్క్ఫోర్స్ నార్త్‌జోన్ బృందం ఛేదించింది. వృద్ధురాలి ఇంట్లో పని చేస్తున్న వ్యక్తి బంగారం, డబ్బుపై కనే్నసి మరొకరితో కలిసి హత్య చేశాడు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్టు చేసి 60 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి, రూ.5,200 నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

05/27/2018 - 01:55

కంచికచర్ల, మే 26: విజయవాడ పెనమలూరుకు చెందిన కంచర్ల శ్రీనివాస్‌ను నకిలీ దస్తావేజులతో రిజిస్ట్రేషన్‌లు చేసి మోసగించిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు విచారణ అధికారి, నూజివీడు డీఎస్‌పీ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు.

05/27/2018 - 01:38

ఎచ్చెర్ల, మే26: మండలంలోని వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య చేసుకొన్న సంఘటన శనివారం చోటు చేసుకొంది. ధర్మవరం గ్రామానికి చెందిన బట్న భాగ్యలక్ష్మి (30) తన భర్త వికలాంగుడు కావడంతో కుటుంబ సభ్యులు అవహేళన చేసేలా మాట్లాడటం వల్ల మనస్తాపానికి గురై చీమలమందు తాగి మృతి చెందింది. ఈమెకు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు.

05/27/2018 - 01:32

సంతమాగులూరు, మే 26: నిత్యం దేవున్ని పూజించే పూజారి ఆపై తిరుపతి శ్రీనివాసుని సన్నిధికి తన భార్యతో బయలుదేరాడు. మార్గమధ్యలో ప్రమాదం రూపంలో మృత్యువు ఆ పూజారి అయిన దేవులపల్లి పర్వతరావు శాస్ర్తీ(51)ని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిలో మక్కెనవారిపాలెం సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

Pages