S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/06/2018 - 04:41

హైదరాబాద్, మార్చి 5: అక్రమ పెట్టుబడుల కేసులో సిబిఐ కోర్టు ముందు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలన్న ఇండియా సిమ్మెంట్స్ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ పిటీషన్‌పై తీర్పును హైకోర్టు సోమవారం నాడు రిజర్వులో ఉంచింది.
దసపల్లా భూమి రిజస్ట్రేషన్ సస్పెన్షన్

03/06/2018 - 03:42

పాతబస్తీ, మార్చి 5: నగరంలో వేర్వేరు పోలీసు స్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ముగ్గురిని సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుండి రూ. 7 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలోని సీసీఎస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఏడీసీపీ షరీన్ బేగం వివరాలు వెల్లడించారు.

03/06/2018 - 03:41

పాతబస్తీ, మార్చి 5: ఆటోలో మరచిపోయిన బ్యాగ్‌ను దొంగిలించిన ఆటోడ్రైవర్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి రూ. మూడున్నర లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఏడీసీపీ షరీన్ బేగం మాట్లాడుతూ నగరంలోని పటమటలంకకు చెందిన ఇంకొల్లు అంకమరావు (35) అగ్రిగోల్డ్‌లో పనిచేస్తూ మానేసి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు.

03/06/2018 - 02:58

ఘట్‌కేసర్, మార్చి 5: ఆర్టీసీ బస్సు కిందపడి ఇంజనీరింగ్ విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అవుషాపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. విద్యార్ధి మృతితో తోటి విద్యార్ధులు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేయడంతో రెండు గంటలపైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

03/06/2018 - 02:57

ఉప్పల్, మార్చి 5: అనాధ ఆశ్రమం నుంచి ఇద్దరు బాలురు తప్పించుకున్న సంఘటన సోమవారం జరిగింది. బోడుప్పల్‌లోని సాయిరాంనగర్ సిల్వర్ లైన్ స్కూల్‌లో చదువుతున్న ఆర్.బలరాం (14), నర్సింగరావు (17)లు పాఠశాలకు వెళ్లి వస్తానని తిరిగి రాలేదు. పాఠశాలకు చెందిన జి.నాగమధు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

03/06/2018 - 02:57

మేడ్చల్, మార్చి 5: అప్పటివరకు పాఠశాలలో తోటి విద్యార్థులతో చదువుకుని ఆడుతూ పాడుతూ ఇంటికి బయల్దేరిన ఓ బాలుడిని మృత్యురూపంలో వచ్చిన ప్రవేటు కాలేజీకి చెందిన బస్సు కబళించింది. బాలుడిని బస్సు చిదిమేసిన దృశ్యాన్ని చూసినా తోటి విద్యార్థులు ఇప్పటి దాకా తమతో సరదగా గడిపిన అతను అంతలోనే దుర్మరణం చెందడాన్ని చూసి జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు.

03/06/2018 - 02:56

రాజేంద్రనగర్, మార్చి 5: యజమాని రాక్షసత్వానికి కార్మికుడు బలైన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్ పరిధిలోని పారిశ్రామికవాడలో పెట్రోజంప్ అనే కంపెనీని నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీలో పని చేసే నిపుణ్‌సాహు(24) ఒరిస్సా నుంచి బతుకుదెరువు కోసం వచ్చి జీవనం సాగిస్తున్నాడు. నిపుణ్‌సాహు పని చేసుకుంటూ అదే కంపెనీలో ఉంటున్నాడు.

03/06/2018 - 02:38

న్యూఢిల్లీ, మార్చి 5: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను రద్దుచేయాలని కోరుతూ మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు, కార్తీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. సిబిఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆధారం చేసుకొని, ఈడీకి నోటీసులు జారీ చేసే అధికారం లేదని కార్తీ చిదంబరం తన తాజా పిటిషన్‌లో వాదించారు.

03/06/2018 - 00:26

కోరుట్ల, మార్చి 5: కోరుట్ల పట్టణంలోని శ్రీనివాస్ రోడ్డులో పాఠశాలకు వెళ్తున్న బి. నందిశ్వర్ అనే అనాథ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్‌తో దాడి చేసిన ఘటన సోమవారం కోరుట్లలో కలకలం రేపింది.

03/06/2018 - 00:22

కరీంనగర్ (లీగల్), మార్చి 5: ఒకే కళాశాలలో చదువుతూనే బాలిక వెంటపడి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని, లేనియెడల చంపుతానని బెదిరించిన కేసులో నిందితుడైన కారుపాకల రఘునాథ్ (20)కు కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్‌లు సోమవారం సంవత్సరం జైలుశిక్ష విధించారు.

Pages