S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/20/2018 - 23:08

అమరాపురం, జూలై 20 : మండల పరిధిలోని హేమావతి గ్రామంలో ఆటో డ్రైవర్ వీరేష్ (24) శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దిలీప్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హేమావతికి చెందిన వీరేష్‌కు తల్లి శంకరమ్మ పొలాన్ని కుదువ పెట్టి ఫైనాన్స్‌లో ఆటోను కోనుగోలు చేసిచ్చింది. ఇటీవల వీరేష్ తాగుడుకు అలవాటు పడి ఫైనాన్స్‌కు కట్టాల్సిన బకాయిలు చెల్లించలేదు.

07/20/2018 - 23:03

నంద్యాల, జూలై 20: నంద్యాల పట్టణంలో శుక్రవారం ఉదయం 11గంటల్లో విశ్వనగర్‌లో కాపురం ఉంటున్న వీఆర్‌ఓ టి.జేజిబాబు రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

07/20/2018 - 23:02

సి.బెళగల్, జూలై 20:మండల పరిధిలోని పలుకుదొడ్ది గ్రామం సమీపంలో ఉన్న క్వారీలో శుక్రవారం పేలుళ్ల ధాటికి కంప్రెసర్ ట్రాక్టర్‌తో పాటు రాళ్లు మీద పడిన సంఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. పలుకుదొడ్డి గ్రామం సమీపంలోని క్రషర్ క్వారీలో ఉదయం కొండ పైన కాంప్రెసర్ సాయంతో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలుళ్లు సంభవించాయి.

07/20/2018 - 22:53

బుచ్చిరెడ్డిపాళెం, జూలై 20: కూలి పనికి వెళుతున్న ఆటో కూలిపోయి 40 మంది వ్యవసాయ కూలీలు ప్రమాదం బారిన పడిన ఉదంతమిది. సేకరించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పంచేడు గ్రామ దళితవాడకు చెందిన 40 మంది వ్యవసాయ కూలీలు దగదర్తి మండలంలోని బాడుగులపాడు గ్రామంలో వేరుశనగ పీకేందుకు ఒక ట్రక్ ఆటోలో శుక్రవారం ఉదయం బయలుదేరారు.

07/20/2018 - 22:50

మేదరమెట్ల,జూలై 20: రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం కలిగిన ఏడుకోట్ల రూపాయలకు పైగా విలువైన సెల్‌ఫోన్లతో ఉన్న లారీ మాయమైన కేసులో ఓనర్ కమ్ డ్రైవర్ రంగనాథ్ దోషిగా పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

07/20/2018 - 22:48

ఒంగోలు, జూలై 20: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 71 మంది వాహన చోదకులకు కోర్టు జైలు శిక్ష విధించినట్లు ఒంగోలు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ డిఎస్‌పి వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో మొత్తం 73వేల 600 రూపాయలు కోర్టు వారు జరిమానాగా విధించినట్లు డిఎస్‌పి తెలిపారు.

07/20/2018 - 22:46

మార్కాపురం, జూలై 20 : నమ్మి 20 లక్షల రూపాయల మేర నష్టపోవడమేకాక ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మార్కాపురం పట్టణానికి సమీపంలో ఇటీవల పురుగుల మందుతాగి గుంటూరుజిల్లా నాదెళ్ళ మండలం నూజెండ్లవారిపాలెంకు చెందిన జి లీలానాగప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాఠకులకు విదితమే. ప్రసాద్ పిఎంఆర్‌వై పథకంలో కర్నూలు, కడప జిల్లాలకు చెందిన ఇన్‌ౄళర్జిగా వ్యవహరిస్తున్నారు.

07/20/2018 - 22:42

మదనపల్లె, జూలై 20: పుట్టపర్తిలోని ఓ కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయడమే కాకుండా తనబిడ్డ చదువుకున్న సర్ట్ఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని, న్యాయం చేయమని ఎస్‌ఐని అడిగితే తన పట్ల అసభ్య పదజాలంతో తిట్టాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంఘటన శుక్రవారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. ప్రస్తుతం ఆమె మదనపల్లె ప్రభుత్వవైద్యశాలలో చికిత్స పొందుతోంది.

07/20/2018 - 22:41

తిరుపతి, జూలై 20: తిరుమలలో భక్తుల కోసం ఏర్పాటుచేసిన పిలిగ్రిమ్స్ అమెటీస్ కాంప్లెక్స్-2లోని ఓ లాకర్‌లో వేసిన తాళాలు వేసినట్లుండగానే అందులో ఉన్న రూ. 30,000 విలువచేసే నగదు, సెల్‌ఫోన్‌లు మాయమైన సంఘటన శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన విజయభాస్కర్ శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. అద్దెగదులు దొరకకపోవడంతో టీటీడీ పీఏసీ-2లో లాకర్లు పొందారు.

07/20/2018 - 22:39

తిరుపతి, జూలై 20: టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి దాదాపు 9లక్షలు వసూళ్లకు పాల్పడి మోసగించిన ముగ్గురు నిందితులను తిరుమల టూటౌన్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బుధవారం రాత్రి నిందితులను తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ వద్ద గల ఓ బార్ ముందు అదుపులోనికి తీసుకున్నామన్నారు.

Pages