-
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించి అక్కడి అధికారులు అడ్డుకోవ
-
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న పోలీస్ బెటాలియన్‌లో ఐదుగురు జవాన్
-
కాసరగోడ్, డిసెంబర్ 4: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక అత్యాచారానికి పాల్పడిన 46 ఏ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
కల్లూరు, మే 20: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామంలో పదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 40ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదైంది. గ్రామానికి చెందిన బాలిక తమ ఇంటిలో టీవీ చూస్తుండగా ఒంటరిగా ఉన్నట్లు గమనించిన మాడుగుల కృష్ణ అనే వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించారు. బాలిక నోరునొక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు.
చిత్తూరు, మే 20: జిల్లా కేంద్రమైన చిత్తూరు ఎస్పీ బంగ్లాలో విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్‌కు అధికారులు సెలవులు ఇవ్వకుండా వేధించడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అయితే పోలీసు అధికారులు మాత్రం మిస్ ఫైర్ వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం(క్రైం), మే 20: కట్టుకున్న భర్తతో విభేదించి వచ్చిన వివాహితను చేరదీసి, ఆమెతో కొంతకాలంగా సహజీవనం చేసి, రెండో పెళ్లికి అడ్డువస్తోందని భావించి, ఆమెను అడ్డు తొలగించుకున్నాడు. సుమారు 15 రోజుల కిందట విశాఖ నగర శివారు నరవ గ్రామంలో ఓ మహిళను పెట్రోలు పోసి దగ్ధం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.
చంద్రగిరి, మే 20: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి గ్రామంలో కామాంధుడైన ఓ తండ్రి మూడేళ్లుగా కన్నకూతురిపై అత్యాచారం చేస్తున్న సంఘటన ఆదివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగుచూసింది. ఈ విషయం తెలిసినా పట్టించుకోని తల్లిపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. జీపు నడుపుతూ జీవనం సాగించే కామాంధుడు కన్నకూతురిపై కనే్నశాడు. తన కామవాంఛను తీర్చమన్నాడు.
ఉప్పల్, మే 20: రామంతాపూర్ ఆనంద్‌నగర్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులతో కూడిన ఓ ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్‌చేసి రూ.70 వేల నగదు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
రేణిగుంట, మే 20: చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని మామండూరు సమీపంలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నబాబుతో పాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులు ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్ కరీముల్లా పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందినవారంతా కర్నూలు జిల్లాకు చెందిన ఒకే కుటుంబం వారని పోలీసుల విచారణలో తేలింది.
కోడుమూరు, మే 20:ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పడంతో ఆ జంట పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం కోడుమూరు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. వారిలో ప్రియురాలు చికిత్స పొందుతూ మృతి చెందగా, ప్రియుడు పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. కోడుమూరుకు చెందిన కురువ కీర్తి స్థానికంగా ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం పూర్తి చేసుకుంది.
డోన్, మే 18:పట్టణ సమీపంలోని రైల్వేగేట్ వద్ద బ్రిడ్డి కింద 45 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదివారం పట్టణ పోలీసులు తెలిపారు. బ్రిడ్జి కింద తెల్లని చొక్కా, నీలం రంగు పంచె ధరించి వున్న వ్యక్తి మృతదేహం పక్కన క్రిమిసంహారక మందు డబ్బా వుండడాన్ని గమనిస్తే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.
కుప్పం, మే 20: తమిళనాడు ఆర్టీసీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గుడుపల్లి ఎస్సై భాస్కర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం చిన్న బొమ్మరసపల్లి గ్రామానికి చెందిన చంద్రప్ప భార్య సరస్వతి(39), కుమారులు ప్రకాష్(18), సుబ్రమణ్యం(24)లు ద్విచక్రవాహనంలో ఆదివారం మధ్యాహ్నం ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్నారు.
పెనుకొండ, మే 20: మండలంలోని గుట్టూరులో ఆదివారం కుటుంబంలో భార్యాభర్తల నడుమ గొడవలు రావడంతో భర్త ఇంట్లో లేని సమయంలో భార్య తన ఏడు మంది పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.