మెయిన్ ఫీచర్

మహిళా నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాలలో మహిళల మనుగడ అంతంతమాత్రంగా ఉంటున్న నేటి తరుణంలో
అతికొద్ది మంది మాత్రమే నిలదొక్కుకోగలిగారు. చట్టసభలలో మహిళలకు 33శాతం
రిజర్వేషన్లు కల్పిస్తే భారతదేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందనేది జగమెరిగిన సత్యం. ఎన్నో ఆటుపోట్ల మధ్య తమదైన ముద్ర వేసుకుని రికార్డు సృష్టించిన మహిళా నేతలు వీరే...

***
పడిలేచిన కెరటంవలే ఒంటిచేత్తో అన్నాడిఎంకే తరుపున ప్రచారం చేసి అధికారాన్ని కైవసం చేసుకుని తన రాజకీయ ప్రస్థానాన్ని
దిగ్విజయంగా కొనసాగిస్తూ తమిళుల నోట ‘అమ్మ’ అని
ఆప్యాయంగా పిలిపించుకుంటున్నారు.
***

షీలాదీక్షిత్ : దేశ రాజధాని ఢిల్లీ పీఠంపై ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా షీలాదీక్షిత్ రికార్డు సృష్టించారు. ఈమె దాదాపు 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
****
మాయావతి : బిఎస్‌పి అధినేత మాయావతి దేశంలోనే అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో ఒంటిచేత్తో అధికారాన్ని కైవసం చేసుకున్న నేతగా చరిత్ర నెలకొల్పారు.
****
మెహబూబా ముఫ్తీ :
కల్లోలిత కాశ్మీర్‌కు తొలి
మహిళా ముఖ్యమంత్రిగా
మెహబూబా ముఫ్తీ ఈ ఏడాది
బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పారు.
*****
సుచేతాకృపలాని : 60వ దశకంలో
తొలి మహిళా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుచేతా కృపలాని పదవీ బాధ్యతలు
చేపట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా
ఆమె అధికార పగ్గాలు చేపట్టారు.
***
నందిని శత్‌పథి :
70 దశకంలో ఒడిసా ముఖ్యమంత్రిగా నందిని శత్‌పథి అనే కాంగ్రెస్ నాయకురాలు పదవీ బాధ్యతలు చేపట్టారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన గోవాకు శశికళ కకోడ్కర్ ముఖ్యమంత్రి అయ్యారు.