మెయిన్ ఫీచర్

అసాధారణం...అద్వితీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దేశంలోని ప్రతి విభాగంలో మహిళా నాయకత్వం పెరగాలి. అపుడే మార్పు సంభవిస్తుంది’’- పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో వ్యక్తమయిన భావాలు ఇవి. వీరి మాటలను నిజం చేస్తూ భారతీయ రాజకీయ ముఖచిత్రంలో మార్పు సంభవిస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో జయలలిత తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుని రాజకీయాలలో తామెవ్వరికీ
తీసిపోమంటూ సవాల్ విసిరారు. ఈ ఇద్దరి ఎంపికతో నేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నలుదశలా మహిళా నాయకత్వం
అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అడుగులు ముందుకు వేస్తోంది. దీనికి నిదర్శనం పశ్చిమ బెంగాల్, తమిళనాడులతో పాటు
గుజరాత్, రాజస్థాన్, కాశ్మీర్ రాష్ట్రాలలో మహిళా నాయకత్వం దిగ్విజయంగా కొనసాగుతోంది.
***

దేశ రాజకీయాలలో మహిళా ప్రాతినిధ్యం చాలా తక్కువ. అలాంటిది వారు అధికారాన్ని రెండుసార్లు హస్తగతం చేసుకోవటం అనేది అరుదైన విషయమే. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాలలో నిలదొక్కుకోగలుగుతున్న మహిళలు రాజకీయ ఎత్తుగడలు వేయటంలో అందెవేసిన చేయిగా నిరూపించుకోగలుగుతున్నారు. దీనికి నిదర్శనం ఏనాడు తమిళ ఎన్నికలలో ఓ పార్టీ రెండవసారి అధికారంలోకి రావటం అనేది జరగలేదు. అలాంటి చరిత్రను జయలలిత తిరగరాసి రెండవ సారి అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు. దాదాపు ఏడు పదుల వయసుకు చేరువవుతున్న ఈ నాయకురాలు చిత్ర పరిశ్రమలోనే కాదు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకుంది. ఆరుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన జయలలిత జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారంటే ఆమెకు రాజకీయ నడత నేర్పిన గురువు ఎంజీఆర్ కృషి అని చెప్పక తప్పదు. జయలలిత జీవితంలో ఇరువురు వ్యక్తుల ప్రభావమే మనకు ఎక్కువగా కనిపిస్తోంది. ఒకరు ఆమె తల్లి సంధ్య. పదిహేనేళ్ల ప్రాయంలో తల్లి చేయి పట్టుకుని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జయలలిత ఆ రంగంలో తనదైన నటన కనబరచి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. రెండవ వ్యక్తి ఎంజీఆర్. ఈ మహానాయకుడి సరసన నాయికగా నటించి ఆయన చూపిన బాటలోనే పయనిస్తూ రాజకీయ ఓనమాలు దిద్దుకుని నేడు జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు. 2014లో జరిగిన ఎన్నికలలో ఓ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీల సరసన నిలబెట్టారు. ఈ ఎన్నికలలో అన్నాడిఎంకే పార్లమెంట్‌లో 37 సీట్లు సాధించి జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ తరువాత అన్నాడింఎంకేదే పైచేయిగా నిలవటం గమనార్హం. 34 ఏళ్ల వయసులో ఎంజీఆర్ స్థాపించిన ఎఐఎడిఎంకేలో చేరిన ఆమె, తొలుత రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అవినీతి, అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్లినా ఆమె పట్ల అభిమానం ఇసుమంతైనా తగ్గలేదని ఈ ఎన్నికలు రుజువుచేస్తున్నాయి. కాళ్లకు ఒంగి ఒంగి దండాలు పెట్టించుకునే సంస్కృతిని పోషించే జయలలితది అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను ఆమె ఏనాడు ఖాతరుచేయకుండా, తన ధోరణిలో మార్పుకు తెచ్చుకోకుండా అదే గాంభీర్యాన్ని నేటికీ ప్రదర్శిస్తారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే జయలలిత ఖాళీ సమయంలో పుస్తకాలు విపరీతంగా చదువుతారు. అదే ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చింది. సినిమా షూటింగ్‌లలోనూ ఖాళీ దొరికితే పుస్తకం చదువుతూ కనిపిస్తారు. అంతేకాదు భారతీయ చలన చిత్ర సీమలో తొలిసారిగా స్కర్ట్ ధరించి నృత్యం చేసిన నటి కూడా ఆమె. ఇవన్నీ ఒక ఎత్తయితే నిండు అసెంబ్లీలో ఆమె చీరలాగినా, ఎంజీఆర్ శవయాత్రలో పాల్గొనకుండా వేదికపై నుంచి తోసేసినా.. ఇలాంటి అవమానాలను దిగమింగుకుని పడిలేచిన కెరటంవలే ఒంటిచేత్తో అన్నాడిఎంకే తరుపున ప్రచారం చేసి అధికారాన్ని కైవసం చేసుకుని తన రాజకీయ ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ తమిళుల నోట ‘అమ్మ’ అని ఆప్యాయంగా పిలిపించుకుంటున్నారు.
అలుపెరుగని నేత దీదీ
పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో అసాధారణ రాజకీయ దిగ్గజంగా మమత బెనర్జీ ఎదిగారు. బెంగాల్ ప్రజల దీదీగా మనసుదోచిన మమత 34 ఏళ్ల వామపక్ష ఆధిపత్యాన్ని కూకటివేళ్లతో పెకిలించి బెంగాల్ రాజకీయ చరిత్రను తిరగరాశారు. కాంగ్రెస్‌లో చిరు నాయకురాలిగా అడుగులు వేసిన మమతాబెనర్జీ నేడు ఆ జాతీయ పార్టీనే తన మాట వినేలా రాజకీయంగా ఎదిగారు. నిజాయితీగా నిదర్శనంగా నేటికీ నేత చీర, హవాయి చెప్పులు ధరిస్తూ సాధారణ జీవితం గడిపే రాజకీయ నేతలలో అతి అరుదుగా కనిపించే ఈమె అవినీతికి ఆలవాలమైన కాంగ్రెస్‌లో ఇమడలేక ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి 1997లో ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. విద్యార్థి దశ నుంచే పలు ఉద్యమాల్లో పాల్గొన్నా 2005లో బుద్దదేవ్ భట్టాచార్య చేపట్టిన భూసేకరణ వ్యతిరేక ఉద్యమంతో ప్రజాదరణ పొందారు. బెంగాల్ రాజకీయాలలో కీలక మలుపు తిప్పే ఏకైక నందిగ్రామ్ ఉద్యమానికి నేతృత్వం వహించి సీపీఎం ఆధిపత్యానికి గండికొట్టి 2011 ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. రైల్వే శాఖకు తొలి మహిళా మంత్రి అయిన మమతా బెనర్జీ తన సొంత రాష్ట్రానికే ఎక్కువ కేటాయింపులు జరుపుకున్నారని విమర్శలను ఎదుర్కొన్నారు. తన రాజకీయ చరిత్రలో ఎన్డీఏ, యూపీఏ కూటమిలతో కలిసి పనిచేసినా ఎక్కడా కూడా తన రాజకీయ విధానాలకు, సిద్ధాంతాల విలువలకు భంగం వాటిల్లితే వెనువెంటనే పదవిలకు రాజీనామా చేసేందుకు వెనుకాడేవారు కాదు. ఏన్డీయే కూటమిలోని కేంద్ర ప్రభుత్వం తెహల్కా కుంభకోణంలో ఇరుక్కున్నపుడు, భారత్‌లోకి ఎఫ్‌డీఐల అనుమతిని నిరాకిరిస్తూ యూపీఏ కూటమి నుంచి వైదొలగటానికి సంశయించలేదు. ఏ పదవి చేపట్టినా అవినీతి మరక లేకుండా, లాలూచీ వ్యవహారాలను దరిచేరనివ్వని మమతను బెంగాల్ గద్దెపై మళ్లీ కూర్చోబెట్టటంలో ఆశ్చర్యం లేదు.
**

మమత: నిజాయితీగా నిదర్శనంగా నేటికీ నేత చీర, హవాయి చెప్పులు ధరిస్తూ సాధారణ జీవితం గడిపే రాజకీయ నేతలలో అతి అరుదుగా కనిపించే ఈమె అవినీతికి ఆలవాలమైన కాంగ్రెస్‌లో
ఇమడలేక ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి 1997లో ఆలిండియా
తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు.
*