ఆంధ్రప్రదేశ్‌

మాజీ మంత్రి వైఎస్ వివేకాది హత్యే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: మాజీ మంత్రి, ఎంపీ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందారెడ్డి మృతి హత్యేనని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. తొలుత గుండెపోటుగా భావించినా ఆయన మృతదేహం రక్తం మడుగులో పడివుండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేశారు. నిమ్స్ వైద్యులు జరిపిన పోస్టుమార్టమ్ రిపోర్టులో ఆయన శరీరంపై ఏడుచోట్ల కత్తిపోట్లు వున్నట్లు వెల్లడైంది. తలలో రెండుచోట్ల పొడిచిన గాయాలు ఉన్నాయి. పులివెందులలో వివేకానందరెడ్డి నివాసానికి వెళ్లిన ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ దాదాపు రెండు గంటల పాటు పరిశీలించారు. పోస్టుమార్టమ్‌లో వచ్చిన ప్రాధమిక నివేదిక తరువాత హత్యగా నిర్థారించారు. కాగా వివేకానందరెడ్డిని హత్యచేశారని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలటంతో ఆయన అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనను హత్యచేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ విజయమ్మ వివేకా నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె భోరున విలపించారు.