ఆంధ్రప్రదేశ్‌

గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో హాఠాన్మరణం చెందారు. గురువారం రాత్రి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇంటికి తిరిగివచ్చారు. బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన గుండెపోటు రావటంతో అక్కడే కుప్పకూలిపోయారు. బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడివున్న ఆయనను పీఏ గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైఎస్ వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె వున్నారు. 1950 ఆగస్టు 8న జన్మించిన ఆయన 1999,2004లో లోకసభ సభ్యునిగా కడప నుంచి గెలిచారు. అలాగే పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. 2009లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగా పనిచేశారు. వ్వవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.