రాష్ట్రీయం

మంత్రులా, దళారులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం టిఆర్‌ఎస్ తంటాలు
టిటిడిపి శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి విమర్శలు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఇసికి ఫిర్యాదు చేస్తాం
హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలోకి తమ పార్టీకి చెందిన నేతలను, ఎంపిటిసిలను చేర్చుకునేందుకు స్వయంగా మంత్రులే దళారుల అవతారమెత్తారని టిటిడిపి శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రలోభపెట్టేందుకు స్వయంగా మంత్రులే రంగంలో దిగుతున్నారని అన్నారు. గురువారం నాడిక్కడ ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టిడిపితోపాటు ఇతర పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకునేందుకు టిఆర్‌ఎస్ నేతలు నానాపాట్లు పడుతున్నారని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉందని గుర్తు చేశారు. ఏ శక్తీ టిడిపిని బలహీనం చేయలేదని, కార్యకర్తల బలం తమ పార్టీకి ఎంతో ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు సమస్యలను పట్టించుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు కోసం ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలను, ఎంపిటిసిలను డబ్బు పెట్టి కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి కె.టి.ఆర్ సచివాలయంలోని తన కార్యాలయంలోనే ఎంపిటిసిలకు డబ్బులిచ్చి మరీ పార్టీ జెండాలు కప్పుతున్నారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. సచివాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చివేయడం దారుణమని అన్నారు. కెసిఆర్ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరినవారు ఇప్పుడు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. పత్తి రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. వారికి వెంటనే క్వింటాకు రూ.1000 బోనస్ అందజేయాలని డిమాండ్ చేశారు.