రాష్ట్రీయం

ఎకరం కూడా చదును చేయకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణ పరిరక్షణ ఉద్యమవేత్త శ్రీమన్నారాయణ

విజయవాడ, డిసెంబర్ 10: ఢిల్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే మేరకు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఒక్క ఎకరం కూడా చదును చేయడానికి లేదని పర్యావరణ పరిరక్షణ ఉద్యమ నేత పండలనేని శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. గురువారం నాడిక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఇష్టం లేకుండా బలవంతంగా, బెదిరింపులకు పాల్పడి ప్రభుత్వం భూములు తీసుకుందన్నారు. ఈ నేపథ్యంలోనే గుండపు చంద్రశేఖర్ భూములను బలవంతంగా చదును చేయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. పచ్చని పంటలున్న 33వేల ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రత్యక్షంగా లక్ష మంది, పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గుండపు చంద్రశేఖర్, రాజేష్‌కుమార్‌లు మాట్లాడుతూ లింగాయపాలెంలోని 7.30 ఎకరాల పొలంలో ఉన్న తమ అరటి పంటను అన్యాయంగా 8న రాత్రి సమయంలో అధికారులు చదును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి వచ్చిన పంట నేల పాలవ్వడంతోపాటు దాదాపు 20లక్షలు నష్టం వాటిల్లిందన్నారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని, మా భూములను వాడుకోవచ్చంటూ ఆ భూములను వదిలి వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
సిబ్బందిపై చర్య: సిఆర్‌డిఏ కమిషనర్
లింగాయపాలెం గ్రామంలో అరటితోటలతో ఉన్న భూములను చదును చేసిన సంఘటనకు సంబంధించి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని సిఆర్‌డిఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. లింగాయపాలెం కాంపిటెంట్ అధారిటీ టి.సీతారామమూర్తిని బదిలీచేసి చార్జి మెమో జారీ చేశామన్నారు. రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, విఆర్‌ఏ యాకోబు, ఆగ్రో సూపర్‌వైజర్ సుబ్రహ్మణ్యంలను కలెక్టర్ సస్పెండ్ చేశారని ఆయన తెలిపారు.