రాష్ట్రీయం

హృదయమా.. వందనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో రోగికి గుండె మార్పిడి
తిరుచ్చినుంచి తరలివచ్చిన గుండె
గంటా ఐదు నిమిషాల్లో తరలింపు
బేగంపేట-సికింద్రాబాద్ గ్రీన్ కారిడార్ ఏర్పాటు
యశోద ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్, బేగంపేట, నవంబర్ 28: కొడిగడుతున్న ఓ ప్రాణం... మరో ప్రాణానికి ఊపిరులూదింది. ఎక్కడో తమిళనాడులో బ్రెయిన్‌డెడ్ అయిన ఓ యువకుడి గుండె ఇక్కడ హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి ప్రాణం పోసేందుకు తరలివచ్చింది. తమిళనాడులోని తిరుచ్చిలో కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ కేసని తేల్చారు. కళ్లముందే కొడుకు అచేతనుడు కావడంతో తల్లిదండ్రుల గుండె చెరువైనా, మరో ప్రాణాన్ని కాపాడే ఉద్దేశంతో కుమారుడి గుండెను దానం చేసేందుకు పెద్ద మనసుతో అంగీకరించారు.
అతని గుండెను తిరుచ్చిలోని కేథర్ ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి వైద్యులు ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. తమిళనాడు నుంచి సికిందరాబాద్‌కు ఈ గుండె కేవలం గంటా అయిదు నిమిషాల్లోనే చేరుకుంది. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి తీసుకురాగా, అక్కడి నుంచి పోలీసులు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసి కేవలం మూడు నిమిషాల ఆరు సెకనుల్లో యశోద ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ నాలుగేళ్ల నుంచి గుండె, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని దాత కోసం ఎదురుచూస్తున్న నల్లకుంటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాసరాజు (50)కు గుండెను అమర్చే ప్రక్రియను యశోద డాక్టర్లు ప్రారంభించారు. ఈ ఆపరేషన్ శనివారం అర్థరాత్రి వరకు కొనసాగింది. కార్డియో థోరాసిక్ సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో వైద్యుల బృందం ఈ గుండెను శ్రీనివాసరాజుకు అమర్చారు.
గత నెల 14వ తేదీన ఆసుపత్రికి వచ్చిన శ్రీనివాసరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ గోఖలే ఆయనకు గుండె మార్పిడి ఒక్కటే మార్గమని సూచించటంతో యశోద ఆసుపత్రి వైద్యులు ఆయన పేరును జీవన్‌దాన్ పథకంలో నమోదు చేసి, అప్పటి నుంచి దాత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా యశోద ఆసుపత్రి సిఇవో డాక్టర్ సురేందర్‌రావు మాట్లాడుతూ బ్రెయిన్‌డెడ్ అయిన యువకుడి గుండె సిద్ధంగా ఉందన్న సమాచారం తెలియటంతో ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో కేవలం గంట 5 నిమిషాల వ్యవధిలో గుండెను నగరానికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. (చిత్రం) గ్రీన్‌కారిడార్ ద్వారా బేగంపేట నుంచి యశోద ఆసుపత్రికి అంబులెన్స్‌లో గుండెను తీసుకువస్తున్న వైద్యులు