రాష్ట్రీయం

చండీయాగం.. పనులు వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి రోజూ 50 వేల మందికి భోజనాలు
101 హోమ గుండాలతో చతుర్వేద యాగశాలలు
కుంకుమార్చనకు ప్రత్యేక ప్రాంగణం
ఏర్పాట్లను పరిశీలించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్, డిసెంబర్ 17: లోక కల్యాణం కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీయాగాన్ని తిలకించడానికి వచ్చే విఐపిలకు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు సామాన్య ప్రజానీకానికి ప్రతీ రోజు 50 వేల మందికి భోజన సదుపాయం,ప్రత్యేక ఏర్పాట్లు, అలాగే 15 వేల వాహనాలకు పార్కింగ్ వసతి కల్పించారు. అయుత చండీయాగం కోసం 40 ఎకరాల విస్తీర్ణంలో 101 హోమగుండాలతో పాటు చతుర్వేద యాగశాలలు ఏర్పాటు చేశారు. రాజశ్యామల యాగం, మహరుద్ర యాగం, అయుత మహాచండీ యాగానికి వేర్వేరుగా యాగశాలలు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలు కుంకుమార్చన చేయడానికి ప్రత్యేకంగా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు. మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే అయుత చండీ యాగం ఏర్పాట్లను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గురువారం పరిశీలించారు. ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 3.45 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు యాగం నిర్వహిస్తారు. శృంగేరి పీఠం నుంచి వచ్చిన 6 గురు ప్రధాన రిత్విజులు చండీయాగాన్ని పర్యవేక్షించనుండగా, దేశం నలుమూలల నుంచి వచ్చే సుమారు రెండు వేల మంది బ్రాహ్మణులు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. యాగాన్ని తిలకించడానికి వచ్చే భక్తుల కోసం యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వీలుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రుత్విజులు బస, భోజనాల కోసం రెండు భారీ ప్రత్యేక వసతీ సముదాయాలను ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా హాల్స్ నిర్మించారు. యాగం అందరికీ కనిపించే విధంగా ప్రత్యేక వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. మీడియా కోసం ప్రత్యేకంగా మీడియా పాయింట్ నిర్మించడంతో పాటు అక్కడి నుంచే వార్తలను పంపించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. విఐపిలు యాగాన్ని తిలకించడానికి వీలుగా ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రతీ రోజు దాదాపు 50 వేల మందికి భోజనాలు పెట్టడం కోసం భోజన శాల ఏర్పాటు చేశారు. వివిఐపిలు, విఐపిల కోసం ఐదు ప్రత్యేక హెలిప్యాడ్‌లు నిర్మించారు. సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి యాగాన్ని తిలకించడానికి, ప్రదక్షిణలు చేయడానికి ఏర్పాట్లు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రాంగణమంతా భారీ స్క్రీన్లు, సిసి కెమెరాల నిఘా నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. వర్షం వచ్చినా సనే నిర్విఘ్నంగా యాగం కొనసాగించడానికి వాటర్ ప్రూఫ్ రూఫింగ్ ఏర్పాటు చేశారు.
యాగానికి రానున్న ప్రముఖులు
అయుత చండీ యాగానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో పాటు తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌తో పాటు తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్లు రోశయ్య, సిహెచ్ విద్యాసాగర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు తదితరులు హాజరుకానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. (చిత్రం) ఎర్రవల్లిలో అయుత చండీయాగం పనులను పరిశీలిస్తున్న కెసిఆర్ దంపతులు