రాష్ట్రీయం

సకాలంలో తాగునీటి పథకాలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలపరిమితి ముగిసినా ప్రపంచబ్యాంకు సాయం
సమీక్షకు హాజరైన ప్రపంచ బ్యాంకు బృందం

హైదరాబాద్, డిసెంబర్ 17: నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో చేపట్టిన తాగునీటి పథకాలను సత్వరం పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యుయస్ ఇఎన్‌సి బి సురేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మూడు జిల్లాల్లో 995 ఆవాసాల్లో తాగునీటి సరఫరా కోసం ప్రపంచ బ్యాంకు 386 కోట్ల 53లక్షల రూపాయల నిధులతో 2013లో పనులు ప్రారంభమయ్యాయి. 810 గ్రామాల్లో మంచినీటి బావుల తవ్వకం, బోర్‌వెల్స్ వేయడం వంటి పనులు చేపట్టారు. మిగిలిన 185 గ్రామాలకు సమగ్ర బహుళ గ్రామ మంచినీటి పథకం కింద రిజర్వాయర్లలో ఇంటెక్‌వెల్స్ నిర్మించి పైప్‌లైన్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పనులను 26 రకాలుగా విభజించారు. ఇందులో 12 పూర్తి కాగా, 14 రకాల పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 236 కోట్ల 78లక్షలు ఖర్చుచేశారు. అయితే వచ్చే ఏడాది మే నాటికి ఈ పథకానికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం నిలిచిపోతుంది. దీంతో ఇఎన్‌సి బి సురేందర్‌రెడ్డి ఈ పథకంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆయా జిల్లాల ఆర్‌డబ్ల్యుయస్ అధికారులు, సిబ్బంది, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో పాటు కాంట్రాక్టర్లతో సమగ్ర సమీక్ష జరిపారు. మిగిలిన పనులు ఎప్పటి లోగా పూర్తి చేస్తారో జనవరి 15 నాటికి యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని, మార్చి వరకు పనులు పూర్తి కావాలని తెలిపారు.
వచ్చే ఏడాది నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని పనులు చేయాలని ఆదేశించారు. పనులు సకాలంలో చేయని ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గడువు పూర్తయినా కొంత కాలం పాటు పథకానికి ఆర్థిక సహాయం అందించాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను ఇఎన్‌సి కోరారు. ఆర్‌డబ్ల్యుయస్ పని తీరు పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. మరి కొంత కాలం సహాయం పొడిగింపునకు అంగీకరించారు. సమావేశంలో ప్రపంచ బ్యాంకు టీం లీడర్ రాఘవ, రిటైర్డ్ ఇఎన్‌సి మోహన్‌రావులతో పాటు ఆర్‌డబ్ల్యుయస్ అధికారులు పాల్గొన్నారు.