తెలంగాణ
పాతబస్తీలో అయిదుగురు రౌడీషీటర్ల అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 28 April 2016
హైదరాబాద్: పాతబస్తీలోని రెయిన్ బజార్, చంద్రాయణగుట్ట, ఫలక్నుమా, మొగల్పురా తదితర ప్రాంతాల్లో గురువారం తెల్లవారు జామును పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి అయిదుగురు రౌడీషీటర్లను అరెస్టు చేశారు. ఈ ప్రాంతాల్లో పలు అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మామిడిపండ్లను కార్బడైతో కృత్రిమంగా మగ్గపెడుతున్న నేరంపై అయిదుగురు వ్యాపారులను అరెస్టు చేశారు. గాజుల తయారీ పరిశ్రమల్లో పనిచేస్తున్న 30 బాలకార్మికులకు విముక్తి కలిగించారు. జంతువుల కొవ్వుతో వంటనూనెలను తయారు చేస్తున్న వ్యాపారులను అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 200 మంది పోలీసులు పాల్గొన్నారు.