రాష్ట్రీయం

ఏప్రిల్‌కల్లా ఇంటింటికీ తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలి విడత తొమ్మిది నియోజకవర్గాలకు తాగునీరు
వాటర్‌గ్రిడ్, గృహ నిర్మాణంపై సిఎం కెసిఆర్ సమీక్ష
మేడ్చల్, తాండూరు, మెదక్‌కు అదనంగా ఇళ్లు మంజూరు
బలహీనవర్గాల ఇళ్ల మంజూరులో రాజకీయ జోక్యం వద్దని ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 24: వాటర్ గ్రిడ్ పథకం ద్వారా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి తొమ్మిది నియోజకవర్గాలకు తాగునీటిని అందించాల్సిందిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్‌తో వాటర్ గ్రిడ్, బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకంపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష జరిపారు.
జనగామ, భువనగిరి, ఆలేరు, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మేడ్చల్ తొమ్మిది నియోజకవర్గాలకు ఏప్రిల్ 30వ తేదీ కల్లా ప్రతి ఇంటికి తాగునీటిని అందించే విధంగా వాటర్ గ్రిడ్ పనులను పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పర్యటించి తాగునీటిని సమస్యను ఎదుర్కొంటున్న గ్రామాలను గుర్తించాల్సిందిగా కలెక్టర్ రఘునందన్‌రావును ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తాగునీటి సరఫరా వ్యవస్థను పరిశీలించి వాటర్ గ్రిడ్ పథకంతో అనుసంధానానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం కింద మేడ్చల్, తాండూర్, మెదక్ నియోజకవర్గాలకు అదనంగా ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్‌పేట, ఉప్పర్‌పల్లిలో అదనంగా మంజూరు చేసిన ఇళ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మెదక్, రామాయంపేట నియోజకవర్గాలకు అదనంగా 800 ఇళ్లు, రంగారెడ్డి జిల్లా తాండూర్‌కు 600 ఇళ్లను ముఖ్యమంత్రి మంజూరు చేశారు.
బలహీన వర్గాల గృహ నిర్మాణం పథకం కింద ఇళ్ల మంజూరులో రాజకీయ నేతల జోక్యం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇళ్ల పథకం కింద గ్రామాలను మాత్రమే సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు సూచిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, మహబూబ్‌నగర్ కలెక్టర్ శ్రీదేవి కూడా పాల్గొన్నారు.