రాష్ట్రీయం

వరంగల్ ఫలితం నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన రాజకీయ పక్షాల్లో ఉత్కంఠ
ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం
ఓట్ల లెక్కింపు హాల్‌లో భారీ భద్రత
కౌంటింగ్‌కు 600 మంది సిబ్బంది

వరంగల్/ హైదరాబాద్, నవంబర్ 23: వరంగల్ ఉప ఎన్నికల ఉత్కంఠకు నేటి మధ్యాహ్నంతో తెరపడనుంది. పార్లమెంటు ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. అధికార తెరాసతోపాటు భాజపా, కాంగ్రెస్‌లు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. త్రిముఖ పోరులో గెలుపెవరిదో నేడు వెలువడనుంది. నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. పార్లమెంటు నియోజకవర్గంలోని స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 21న నిర్వహించిన ఉప ఎన్నికలో మొత్తం 15,9,671 మంది ఓటర్లకు గాను 10,44,541 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 69.19 శాతం ఓట్లు పోలయ్యాయి. మార్కెట్ యార్డులో నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఏడు నియోజకవర్గాల్లో 1778 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ జరుగగా, ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లకు అనుగుణంగా రౌండ్‌లను విభజించి లెక్కిస్తారు. నియోజకవర్గంలోని 14 టేబుళ్లలో నిర్వహించే ప్రతి రౌండ్‌లో 14 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తరువాత ఈవిఎంల ద్వారా ఓట్లను లెక్కించే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రౌండ్‌లోని ఓట్లను లెక్కించడానికి 10 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 600మంది సిబ్బందిని నియమించారు. ప్రతి నియోజకవర్గానికి 80మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ప్రతి రౌండ్‌కు నిర్వహించే ఓట్ల లెక్కింపు వివరాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల ద్వారా రిటర్నింగ్ అధికారులకు అందజేస్తారు. తుది ఫలితం మధ్యాహ్నం వరకు వెలువడే అవకాశాలున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా స్ట్రాంగ్‌రూంల వద్ద, వ్యవసాయ మార్కెట్‌యార్డు పరిసరాల చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సిసి కెమెరాలను అమర్చారు. కౌంటింగ్ హాల్‌లోకి విధులు నిర్వహించే సిబ్బందిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. అభ్యర్థి తరపున నియమించిన ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ హాల్‌లకు అనుమతి ఉంటుందన్నారు. కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ కరుణ చెప్పారు.(చిత్రం ఏనుమాముల మార్కెట్‌లో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు