రాష్ట్రీయం

మావోల పేరుతో వాల్ పోస్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయకులు, అధికారులకు హెచ్చరికలు * విలేఖరులపైనా ఆగ్రహం
కాగజ్‌నగర్, డిసెంబర్ 3: పట్టణంలో మావోయిస్టుల పేరట వెలిసి వాల్ పోస్టర్లు చర్చనీయాంశానికి దారి తీశాయి. పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి, బట్టుపల్లి చౌరాస్తా, ఎన్టీఆర్ చౌరాస్తాల్లో పీపుల్స్ వార్ పేరిట వాల్ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సరిగా పని చేయడం లేని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, గత కొనే్నండ్లుగా ప్రజలు భూసమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోణప్ప తన అనుచరులతో భూములు కబ్జా చేసుకుంటున్నాడని, పేదలు పట్టాల కోసం, పాస్ పుస్తకాల కోసం తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేక పోతోందన్నారు. ఎంపిడిఓ, ఎంఇఓ, విద్యుత్ శాఖ అధికారులు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని ఈ పోస్టర్లలో పేర్కొనడం గమనార్హం. పనిలో పనిగా మావోయిస్టుల పేరుతో వెలిసి న ఈ పోస్టర్లలో విలేఖర్లను సైతం ప్రస్తావించారు. నాయకులు, అధికారులు చెప్పిన వార్తలకే ప్రాముఖ్యత ఇస్తున్నారని విలేఖర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఈపోస్టర్లు మావోలే అంటించారా? లేక గిట్టని వారు చేసిన పనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈపోస్టర్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు.