రాష్ట్రీయం

వక్ఫ్ భూముల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆక్రమణదారులపై ఉక్కుపాదం * మండలిలో మంత్రి పల్లె హామీ
హైదరాబాద్, డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శీతాకాల సమావేశం మూడోరోజైన శనివారం పలు అంశాలపై అసక్తికరమైన చర్చ జరిగింది. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, అదే విధంగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చ జరగాలని విపక్షాలకు చెందిన సభ్యులు పట్టుబట్టారు. మండలి చైర్మన్ చక్రపాణి అనుమతితో మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమాధానమిస్తూ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రయివేట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరిస్తాం.. కానీ రెగ్యులరైజ్ చేయవద్దని సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన సౌకర్యాలపై క్షణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
మైనార్టీల సంక్షేమానికి కృషి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉన్న దాదాపు 65,771 ఎకరాల వక్ఫ్ భూముల్లో సగానికిపైగా అన్యాక్రాంతం అయ్యాయని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మండలి సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి సభ్యుడు షరీఫ్ మహ్మద్ అహ్మద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దేవాదాయ చట్టం పరిధిలో ఉన్న దుకాణాలు, భూములను ఇతర మతాల ప్రజలకు అద్దెకు లేదా కౌలుకు ఇవ్వరాదన్న విషయం వాస్తవమేనని తెలిపారు. వక్ఫ్ స్థలాలను రక్షించేందుకు ప్రత్యేక జీవోను తీసుకు వచ్చి వాటిని పరిరక్షిస్తామని మంత్రి చెప్పారు.
ప్రజాప్రతినిధులకేవీ వైద్య సేవలు?
ప్రస్తుత, మాజీ శాసన సభ, మండలి సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వైద్యాధికారులు సకాలంలో సరిపడే మందులు అందించడంలేదని సభ్యులు ప్రతిభాభారతి సభలో ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి యనమాల రామకృష్ణుడు మాట్లాడు మందులు పంపిణి చేయడంలో ఎలాంటి డబ్బుల కొరత లేదని ప్రతి మండలి, శాసనసభ మాజీ, ప్రస్తుత సభ్యులకు వైద్యసేవలు తప్పకుండా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.