తెలంగాణ

వరంగల్ గ్రేటర్ బరిలో 422మంది అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 26: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 422 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 58 డివిజన్లకు గాను 811 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా శుక్రవారం 389 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. టిఆర్‌ఎస్, బిజెపి 58 డివిజన్లలో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 49, టిడిపి 48 డివిజన్లతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌లో నలుగురు అభ్యర్థులు బిఫాం తీసుకోకపోగా మరో ఐదుగురు తిరస్కరణకు గురయ్యారు. దీంతో 49 డివిజన్‌లలోనే కాంగ్రెస్ పోటీ చేస్తోంది. టిడిపికి పది డివిజన్‌లలో అభ్యర్థులు దొరకలేదు. దీంతో 48 డివిజన్‌లతోనే సరిపెట్టుకొని మరో 10 డివిజన్‌లలో కలిసొచ్చే పార్టీలకు మద్దతు ఇస్తామని ఆ పార్టీ నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. గ్రేటర్ పోరులో ఎక్కువ మంది టిఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థులే బరిలో ఉన్నారు. ఒక్కో డివిజన్ నుండి ఇద్దరు, ముగ్గురు చొప్పున రెబల్ అభ్యర్థులు పోటీలో ఉండడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ విజయంతో వరంగల్ గ్రేటర్‌లో కూడా సునాయసంగా విజయం సాధిస్తామన్న టిఆర్‌ఎస్‌కు రెబల్స్ బెడద నాయకులకు వణుకుపుట్టిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు వారి వారి అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో సత్తా చాటారు. దీంతో టిఆర్‌ఎస్‌లో టికెట్ల ముసలం మొదలైంది. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య అభ్యర్థుల జాబితాలో కొన్నిపేర్లు తారుమారయ్యాయి. 27వ డివిజన్ నుండి టిఆర్‌ఎస్ నేత ప్రదీప్‌రావుకు ముందుగా టికెట్ ఖరారైనప్పటికి చివరి క్షణంలో రద్దయి ప్రముఖ న్యాయవాది వద్దిరాజు గణేష్‌కు దక్కింది. 36, 52 డివిజన్‌లలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ డివిజన్లలో పోటీ చేసేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడం, అందరు కూడా ముఖ్యనాయకులే కావడం అభ్యర్థుల ఎంపిక ఇబ్బందిగా మారింది. ముందుగా ఆ డివిజన్ నుండి నార్లగిరి రమేష్‌కు టికెట్ ఖరారు కాగా చివరి క్షణంలో మాజీ కార్పొరేటర్ అబుబక్కర్‌కు దక్కింది. 52వ డివిజన్‌లో టిఆర్‌ఎస్ నేత నార్లగిరి రమేష్ సతీమణి రాజమణికి ఉత్కంఠ మధ్య టికెట్ ఖరారైంది. కాగా ఎమ్మెల్సీ కొండా మురళి అనుచరుడిగా ఉన్న రమేష్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆయన స్థానంలో అనూహ్యంగా బయ్య స్వామికి టికెట్ దక్కింది. 29వ డివిజన్‌లో నాగపురి కల్పనకు ముందుగా టికెట్ కేటాయించగా అనూహ్యంగా స్థానిక నాయకుడు కావేటి రాజు భార్య కవితకు టికెట్ ఖరారైంది.