మెయిన్ ఫీచర్

ఒత్తిడి భారం.. వ్యాధులకు సంకేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనసుని అదుపులో వుంచుకోగలిగినవారే మహాశక్తిశాలురని’ లోకోక్తి. రోజు రోజుకీ సంక్లిష్టమవుతున్న జీవనశైలిలో ప్రతినిత్యం మనసు ఎన్నో రకాల ఒత్తిళ్ళకు గురి కావలసి వస్తోంది.సమస్యలతో యుద్ధం చేయడమే మనిషి జీవితంగా మారిపోయిన ఈ రోజుల్లో మానసిక ప్రశాంతత అన్నది అందినట్టే అంది చేజారిపోతూ వుంటుంది. ఇటీవల జరిగిన ఓ సభలో మీలో మానసిక ఆనందం ఉన్నవారు చేతులు ఎత్తండి అని అంటే.. ఒకరిద్దరు మాత్రమే చేతులు ఎత్తగలిగారు. అంటే చేతి నిండా డబ్బు, ఆస్తి, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్నా నేటి ఆధునిక సమాజంలో మానసిక ఆనందం కరువైంది. ఒక రౌడీని చితగొట్టేసరికి మరో రౌడీ వచ్చి ఎదురుగా సిద్ధమయ్యే తెలుగు సినిమా ఫైటింగ్‌లా ఒక చికాకునుండి తప్పించుకుని కాసేపు రిలాక్సవుదామనుకుంటుండగానే మరో తలనొప్పి ప్రత్యేక్షం. అందరికీ ఏవేవో సమస్యలూ, ఏవేవో టెన్షన్లూ. ఇలాంటి మానసిక ఆందోళనలన్నీ కూడా శారీరక రోగాలకు దారితీస్తున్నాయని పరిశోధనలలోనూ వెల్లడవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో సగటు మనిషిగా జబ్బుల్ని కూడా కొనితెస్తున్న ఆందోళన, వత్తిడినుండి బయటపడ్డానికి ఎవరికివారే నడుం బిగించక తప్పదు.
ముందుగా గుర్తించవలసిందేమిటంటే, ఎదుటి మనిషికి చిరాకెత్తించే అంశంలో మన పాత్ర ఎంతవరకు ఉంది అనేది? ఎదుటి వ్యక్తి స్థానంలో మనం ఉండి ఉంటే మన గురించి ఏ విధంగా స్పందించి ఉండే వాళ్ళం? అనే ప్రశ్న వేసుకోవాలి. నిజంగా అంత ప్రమాదకరమైన విషయం ఏదీ జరగలేదనుకుంటే, మనల్ని మనం క్షమించుకుని, అవతలి వ్యక్తినీ క్షమించేస్తే ఆ ఫైలు అక్కడితో మూసేసి మూలకి విసిరేయవచ్చు. మనం ఏ తప్పూ చేయకుండానే ఎదుటివారు మన మానసిక ప్రశాంతతను కొల్లగొట్టేవిధంగా ప్రవర్తించారనుకుంటే నిదానంగా, సూటిగా, ఆ విషయాన్ని వారికి తెలియజేయడం మంచిది. ఒకరినొకరు దూషించుకుని కక్షలూ, కార్పణ్యాలూ పెంచుకుంటూ పోతే.. ఇరుపక్షాలవారూ మనశ్శాంతిని దూరం చేసుకోవలసి వస్తుంది. అన్యాయం జరిగితే ప్రతిఘటించడం, న్యాయం జరిగేవరకూ పోరాడ్డం ప్రతి ఒక్కరి హక్కు. కానీ తొందరపాటువల్ల ఆవేశానికి లోనై మాటా మాటా అనుకోవడం సహజంగా జరిగే సంగతి. ఇలాంటి విషయాల్లోనే మనం కొంచెం సంయమనం పాటించాలి.
గినె్నలు కడిగి ట్యాప్ కట్టేయలేదని కోడలిపై అత్త విరుచుకుపడి ప్రళయం సృష్టిస్తే, అక్కడ కోడలు కూడా ఆమెతో సమాన స్థాయిలో గొడవ పడటంవల్ల ఒరిగేదేమిటి? జరిగేదేమిటి? చూసినవాళ్లు.. అత్తా కోడళ్ళు కొట్టుకుంటున్నారంటూ వ్యాఖ్యానిస్తారు. అలా కాకుండా కోడలు రెండు నిముషాలు నిగ్రహం పాటించి, ఇంత చిన్న విషయానికి అంత రాద్ధాంతం అనవసరమని భర్తచేత చెప్పించడం ఒక సామరస్య పూర్వకమైన పద్ధతి.
మనసు తరచూ మితిమీరిన వేగంతో ప్రయాణించే ఒక వాహనం అనుకుంటే- నిగ్రహం, ఓర్పు అనే బ్రేకులతో దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటేనే తప్పిదాల యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి.
మనుషుల మధ్య ఇలాంటి ఆగ్రహావేశాలు చోటుచేసుకున్నపుడు రెండవ ఆలోచన చాలాసార్లు మనకు మంచే చేస్తుంది. భరించలేని కోపం వచ్చి, ఎవరినో ఒకరిని అనరాని మాటలు అనేస్తాం. గాయానికి మందు పెట్టినా, మచ్చ మాత్రం మిగిలిపోయినట్టుగా, మన మాట మాత్రం వారి హృదయ కుహరంలో ఒక మూల అలాగే మిగిలే ఉంటుంది.
వీలు దొరికినపుడల్లా కొద్ది క్షణాలు కళ్లు మూసుకుని ధ్యానం అభ్యసించడంవల్ల మనల్ని మనం నిగ్రహించుకునే శక్తిని పెంచుకోగలుగుతాం. చర్యకు ప్రతిచర్య భౌతిక సత్యమే అయినా ప్రతిచర్యకి ముందు కొన్ని క్షణాలు నిగ్రహంతో ఉండి, ఆపైన చేయదలల్చుకున్నది చేయడంవల్ల అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండే వీలుంది. మనం ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది మన మానసిక ప్రశాంతతని దూరం చేయకుండానే ఉంటే చాలు.

-కోలపల్లి ఈశ్వర్