విజయవాడ

ఉపాధి హామీ పథకం అనుసంధానంతో రూ.690 కోట్లతో జిల్లా అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్) ఫిబ్రవరి 27: జిల్లా అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో పనిచేసి ఆదర్శంగా నిలిపేందుకు అందరం కలిసి పనిచేద్దామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ వల్లభనేని శౌరి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కొలుసు పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్, కైలే అనీల్‌కుమార్, కే రక్షణనిధి, దూలం నాగేశ్వరరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు రాజేంద్రప్రసాద్, కేఎస్ లక్ష్మణరావు, డాక్టర్ రామకృష్ణ, అశోక్‌బాబు, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్లు కే మాధవీలత, కే మోహన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వ్యవసాయం, ఉపాధి హామీ, నీటి పారుదల, అమ్మవడి, నాడు-నేడు, పెన్షన్లు పంపిణీ, ఇళ్ల స్థలాలు, తాగునీరు, స్పందన, పౌర సరఫరాలు తదితర అంశాలపై జరిగిన సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ అనుసంధానంతో సుమారు రూ.690 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరైయ్యాయన్నారు. ఇందులో రూ.326కోట్లతో 4వేల సీసీ రోడ్లు, రూ.221కోట్లతో 1014 సీసీ డ్రైన్లు, రూ.104 కోట్లతో 272 గ్రామ సచివాలయ భవనాలు, రూ.17 కోట్లతో 300 పాఠశాలలకు ప్రహరీగోడల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, గడిచిన ఆరు నెలల కాలంలో జిల్లాలో 70లక్షల ఉపాధి పనిదినాలు సాధించామన్నారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్ల స్థలాలు అందించేందుకు 1345 లే అవుట్ల అభివృద్ధి చేస్తుండగా, ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో 1042 లే అవుట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నివేశన స్థలాలకు భూమి మెరక అవసరం లేని చోట అంతర్గత రహదారుల నిర్మాణాలు తక్షణమే చేపట్టామని మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో అవరోధాలు ఎదురైతే వాటిని తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తానన్న మంత్రి ప్రజాసమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈవిషయంలో అధికారులు పారదర్శకంగా చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుతూ, నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీల అభిమానం చూరగొన్న ప్రభుత్వమని, ముఖ్యమంత్రి వారి పక్షపాతిగా ఎన్నో కార్యక్రమాలను అమలుచేస్తున్నారన్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూములను బలవంతంగా తీసుకోబోమని స్పష్టం చేసిన ఆయన ప్రభుత్వం అమలుచేసే నవరత్నాల్లో ఏ పథకంలోనైనా అనర్హులుగా గుర్తిస్తే వెంటనే సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించి తమ అర్హతను నిరూపించుకుంటే 5రోజుల్లోనే పునరుద్ధరించుకోవచ్చునని, అర్హులైన వారు పెన్షన్, బియ్యం, కార్డు, అమ్మవడి, తదితరాలను పొందడం నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు గడువును పొడిగించాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరగా ప్రస్తుతం మార్చి 15వరకూ ఉన్న గడువును పెంచేందుకు మంత్రి సముఖత వ్యక్తం చేశారు. సొమ్ము చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని జేసీని ఆదేశించారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, నూజివీడు, నియోజకవర్గాల పరిధిలో తాగు, సాగు నీటి సమస్యల గురించి విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంత్రి దృష్టికి తీసుకురాగా, అందుకు స్పందించిన ఆయన నాగార్జున సాగర్ ఎడమకాలువ నుంచి 3వేల క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా, కేవలం 800 నుంచి 1200 క్యూసెక్కుల నీరు మాత్రమే అందుతోందని, పులించింతల నుంచి రావాల్సిన నీటిలో 9 అన్ పీరియడ్, 6రోజులు ఆఫ్ పీరియడ్ కింద నీటి విడుదల జరుగుతోందని, దీనివలన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈవిషయాలపై సమగ్రంగా చర్చించి పరిష్కారం జరిగేలా కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఆరేళ్ల తరువాత కృష్ణాడెల్టాలో రెండో పంటకు నీరందిందని, ఇందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపే తీర్మానం చేయాలని ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన ప్రతిపాదనకు సమావేశం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
ఎమ్మెల్యే కేపీ సారథి మాట్లాడుతూ ఉయ్యూరు మార్కెట్ యార్డు స్థలాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించకుండా మార్కెట్ భవిష్యత్తు అవసరాల కోసం ఉంచాలని, రైస్ మిల్లర్లకు రైతులు నేరుగా అమ్మిన ధాన్యానికి సొమ్ము దక్కేలా చూడాలన్నారు. విజయవాడ నుంచి ఉయ్యూరు వరకు ఉన్న నదీ కాలువ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరిన మీదట, కృష్ణాడెల్టా ఆధునీకరణ పనులు తిరిగి చేపట్టాలని మంత్రి సూచించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ బుడమేరు కాలుష్యంతో నగరం దోమల వలయంగా మారిందని, బుడమేరు ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని కోరగా ఇందుకు స్పందించిన కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కృష్ణా, గోదావరి కాలువల ప్రక్షాళనకు సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేశారని, ఇందులో భాగంగా సుమారు 360 కి.మీ మేర నాలుగు కాలువల శుద్ధికి డీపీఆర్ సిద్ధం చేశామన్నారు. అలాగే బుడమేరు పూడికతీత పనుల కోసం రూ.2కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, జిల్లాలో 9.85 కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద 96 నివాసిక ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు గుర్తించామన్నారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నగరంలోని పేదలకు నగరంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రైతు భరోసా పథకాన్ని ఆర్థికంగా వెనుకబడిన సర్పంచ్, ఎంపీటీసీలకు వర్తింపజేయాలన్న సూచనకు సానుకూలంగా స్పందించి నిబంధనలను సవరించిన వైనంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు.